ఈ చిన్న పొరపాట్లే ఆడవాళ్ళ బరువు పెరగడానికి కారణం అవుతాయి... !!
పడుకోబోయే ముందు బాగా హెవీగా తినడం చాలా చెడ్డ అలవాటు.పగటి పూట తిన్నాగాని పర్వాలేదు. ఎందుకంటే పగటి పూట జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అదే మనం నైట్ ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి పడుకొనే ముందు భారీగా భోజనం చేస్తే శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు.తిన్న ఆహారం అంతా శరీరానికి పడుతుంది.ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది.అలాగే ఆడవాళ్ళకు ఒక ముఖ్య సూచన భోజనం చేసిన వెంటనే పడుకొనే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. డిన్నర్ తర్వాత కనీసం అరగంట సమయమన్న నడవాలి. జీర్ణ ప్రక్రియ సులభంగా మరియు సమర్ధవంతంగా జరగటానికి సహాయపడుతుంది.అలాగే ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుని పడుకోకూడదు కాబట్టి శరీరంలో కొవ్వు నిల్వ ఉండిపోతుంది.అధిక క్యాలరీ ఫుడ్ తీసుకోవటం వలన బరువు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. రాత్రి పడుకొనే ముందు సలాడ్లు లేదా పండ్లు వంటి తేలికపాటి ఆహారం తింటే బరువు పెరగరు.
రాత్రి సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం.అనవసరమైన కాలక్షేపణ చేయడం,ఫోన్ నొక్కడం,టీవీ చూడడం లాంటివి చేయకూడదు.అలా చేయడం వల్ల ఆ ప్రభావం నిద్ర మీద పడుతుంది.రాత్రిపూట ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తే మోర్నింగ్ టిఫన్ తినడం మానేస్తారు. అది ఫలితంగా ఒకేసారి ఎక్కువ భోజనం చేస్తారు. ఏది కూడా బరువు పెరగడానికి ఒక కారణం.. కొంతమంది ఆడవాళ్లు భోజనం చేసాక ఏవన్నా స్నాక్స్ తినడం లాంటి అలవాటు ఉంటుంది.. అది మానేయాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం ద్వారా ఆడవాళ్లు సులువుగా బరువు తగ్గవచ్చు.. !!Powered by Froala Editor