అమ్మ : సుఖ ప్రసవం జరగాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. !!

Suma Kallamadi
గర్భం అనేది ఆడవాళ్ళకి దేవుడి ఇచ్చిన వరం.. కడుపులో బిడ్డని మోయడం అనేది ఒక గొప్ప మధురానుభూతి. గర్భంతో ఉన్నపుడు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే సుఖ ప్రసవం అవుతుంది. అందుకనే ప్రతి గర్భిణీ స్త్రీ  ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు ,పప్పు ,మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి.మొదటి నెల నుంచి వైద్యుడిని సంప్రదించి సరైన మందులు వాడాలి. అలాగే టీకాలు కూడా వేయించుకోవాలి మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము . సొంతముగా మందులు వాడడము, ఎక్సరే తీయించుకోడం చేయకూడదు.



ఎత్తుమడమల చెప్పులు వాడకూడదు. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది మొదటి మూడునెలలు చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము లాంటివి  చేయరాదు . అలాగే గర్భంతో ఉన్న మహిళకు నిద్ర అనేది చాలా ముఖ్యం. రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.



రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి.గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెరుకు రసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: