అమ్మ: ఆపరేషన్ చేయించుకోవాలని అనుకునే గర్భిణీ స్త్రీ లకు కొన్ని సూచనలు.. !!

Suma Kallamadi
కడుపుతో ఉన్నపుడు చాలా మంది ఆడవాళ్లు డెలివరీ గూర్చి బయపడిపోతూ ఉంటారు..నార్మల్ డెలివరీ అవుతుందా.. !!లేక సిసేరియన్ అవుతుందా.. !అని బయపడిపోతూ ఉంటారు. ఒకప్పుడు అయితే సిజేరియన్ అంటే విచిత్రంగా మాట్లాడుకునేవారు.అప్పట్లో ఆపరేషన్ అంటే బయపడిపోయేవారు.కానీ ఇప్పుడు ఆపరేషన్ అంటే మాములు అయిపొయింది. ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే విచిత్రంగా చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళ దగ్గర్నించీ, డాక్టర్ల వరకూ అందరూ సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు. సిజెరియన్ అంటే సర్జరీ ద్వారా బిడ్డని బయటికి తీయడం. ఒకప్పుడు తల్లి ప్రాణానికో, బిడ్డ ప్రాణానికో ముప్పు ఉన్నప్పుడు మాత్రమే చేసే ఈ సర్జరీ చేసేవారు. ఇప్పుడు కామన్ అయిపొయింది. నిజానికీ నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీకి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి.



కానీ, నార్మల్ డెలివరీలో ఉండే నొప్పి తట్టుకోవడం కంటే డబ్బులు ఖర్చు పెట్టడమే మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది ఆలోచిస్తున్నారు. నార్మల్ డెలివరీ లో కూడా నొప్పిని తగ్గించే ఇంజెక్షన్స్ ఉంటాయి.కానీ నార్మల్ డెలివరీ వైపు ఎవరు మొగ్గు చూపడం లేదు. అలాగే రెండోది జాతకాల మీద నమ్మకం. ఆపరేషన్ అనుకోండి మంచి, చెడు  చూపించుకుని బిడ్డను కనవచ్చు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఆపరేషన్ మీద మొగ్గు చూపుతున్నారు. ఒక్కోసారి చాలా ఏళ్ళ తర్వాత గర్భం ధరించినా.. సహజ ప్రసవం ప్రమాదకరం కాకపోయినా, సిజేరియన్లోలా బిడ్డని పువ్వులా బయటికి తీయడమైతే జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లకి ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు అడగడంతో సిజేరియన్ చేయడానికి అంగీకరిస్తున్నారు.



 నార్మల్ డెలివరీలో బిడ్డ జననం ఎవరి చేతిలోనూ లేదు. అది సరైన టైం కాకపోతే బిడ్డ భవిష్యత్ బావుండదేమో అన్న భయం, బెంగ. అదే సిజేరియన్ డెలివరీ అయితే అనుకూలమైన సమయంలో డెలివరీ జరుగుతుంది. బిడ్డ జాతకం బావుంటుంది అనే భరోసా.కానీ ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఆ మహిళకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక గంట నొప్పి భరించలేక ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కానీ తర్వాత చాలా కాంప్లికేషన్స్ వస్తాయి.వీలయితే సహజ ప్రసవం మంచిది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: