అమ్మ : గర్భిణీతో ఉన్న స్త్రీ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
గర్భవతి అని తెలిసిన దగ్గర నుండి కడుపులో పెరిగే బిడ్డ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం లోపల పెరుగుతున్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.గర్భిణీ స్త్రీకి గర్భధారణ సమయంలో అవసరమయ్యే ముఖ్యమైన ఆహారాలలో గుడ్లు ఒకటి. సమతుల్య ఆహారం అని పిలువబడే గుడ్డు గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది.ఎగ్స్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్స్ గర్భస్థ శిశువు ఆరోగ్యానికి, కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. దీనిలోని అనేక రకాల పోషకాంశాలు తల్లి మరియు బిడ్డకు వివిధ రకాలుగా సహాయపడతాయి. గర్భిణీతో ఉన్న స్త్రీ గుడ్డు తినడం వల్ల తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలో ఇప్పుడు  తెలుసుకుందాం.. !!


కొవ్వును కరిగించే విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ అధికంగా ఉంటుంది.  ఇది బిడ్డ నార్మల్ గా పెరగడానికి సహాయపడుతుంది. కడుపులో పెరుగుతున్న శిశువు శరీరంలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, కళ్లుఇతర అవయవాల ఏర్పాటుకు విటమిన్ అ చాలా గొప్పగా సహాయపడుతాయి.పుట్టబోయే బిడ్డ యొక్క ఇంటిలిజెన్స్ లెవెల్స్ పెరగడానికి  గుడ్డు చాలా ఉపయోగం. అలాగే గుడ్డులో  ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శిశువు మెదడు అభివృద్ధి మరియు తెలివితేటలతో ముడిపడి ఉన్నాయి. గుడ్డులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది మరియు విటమిన్ "డి" గ్రహించడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది.


గుడ్డులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, విటమిన్ డి, విటమిన్ బి 12 మరియు విటమిన్ బి 2 వంటి విటమిన్లను కూడా అందిస్తాయి.గుడ్డు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.ఇది శిశువుకు గుండె సమస్యలతో బాధపడకుండా ఉండటానికి సహాయపడుతుంది.తల్లి, బిడ్డ ఇద్దరికీ ఇది చాలా మంచి పోషకాహారం.గుండె సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలతో బిడ్డ పుట్టకుండా కాపాడటానికి గుడ్లు సహాయపడతాయి.గుడ్డు వల్ల ఎన్ని ఉపయోగాలో చూసారు కదా. !!అందుకే  గర్భిణీతో ఉన్న స్త్రీ తప్పకుండా కనీసం రోజుకు ఒక గుడ్డు అయినా తింటే చాలా మంచిది. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: