అమ్మ : గర్భంతో ఉన్న మహిళ ఈ మందులు అసలు వేసుకోకూడదు.. !!
యాంటీ బయాటిక్స్ ను కొంతమంది తరచుగా వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మామూలు సమయంలో వేసుకుంటే పర్వాలేదు కానీ ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యుల సూచన లేకుండా అస్సలు వేసుకోకూడదు.
గర్భంతో ఉన్న మహిళలకు నొప్పులు రావడం సహజం. వీపు, తల, కాళ్లు ఇలా అనేక నొప్పులు వేధిస్తాయి. మామూలు సమయాల్లో ఇలాంటి సమస్యలకి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దీని వల్ల గర్భిణీలకే కాదు.. వారి కడుపులోని పిల్లలకి కూడా చాలా ప్రమాదం. మరీ సమస్య ఎక్కువగా ఉంటే మీ వైద్యులని సంప్రదించి వారి సూచనల మేరకు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి.
అలాగే కడుపుతో ఉన్నపుడు కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కానీ, మరే ఇతర కారణాలతో కానీ ఎలర్జీలు వస్తుంటాయి. అదేపనిగా తుమ్ములు, దగ్గు, చర్మంపై దద్దుర్లు, దురద వంటివి వస్తుంటాయి. ఎలర్జీ అంతగా బాధిస్తుంటే.. కొన్నింటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. ఇంటిని క్లీన్ చేయడం, ఫిల్టర్స్ని మార్చడం, షూ,చెప్పులను బయటి ఉంచడం, పెంపుడు జంతువులు ఉంటే వాటికీ దూరంగా ఉండడం,గదిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.చిన్న చిన్న చిట్కాలను పాటించాలి. అంతే కానీ ఏ ట్యాబ్లెట్స్ పడితే అవి వేసుకోకూడదు. కచ్చితంగా వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలతోనే వేసుకోవాలి.