అమ్మ : గర్భవతి అవ్వాలంటే ఋతుస్రావం అయిన తర్వాత ఈ రోజుల్లో కలవాలి. !!
మీ ఋతు చక్రం యొక్క కాలం 28 రోజులు అయితే 11 నుండి 16 రోజుల మధ్యలో అండోత్సర్గం ఏర్పడవచ్చు. ఈ మధ్య కాలంలో గుడ్డు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ గుడ్డు యొక్క పరిపక్వతను బట్టి అండోత్సర్గం జరుగుతుంది.
మీ ఋతు చక్రం 28 రోజులకు ఒకసారి జరుగుతున్నట్లయితే 14 వ రోజున అండోత్సర్గం జరుగుతుంది. ఒక వేళ మీ ఋతు చక్రం యొక్క కాలం 22 రోజులు అయితే మీ నెలసరులు ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశం ఉంది. ఋతు చక్రం యొక్క కాలం (22 రోజులు) తక్కువగా ఉండి రుతుస్రావం 7 రోజుల వరకూ ఉన్నట్లయితే అప్పుడు కూడా రుతుస్రావం ముగిసిన వెంటనే అండోత్సర్గం జరిగే అవకాశాలు ఉన్నాయి. మాములుగా పురుషుల యొక్క శుక్రకణాలు స్త్రీ యొక్క శరీరంలో 2 లేదా 3 రోజుల పాటు ఆక్టివ్ గా ఉంటుంది కనుక ఆ సమయంలో గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్పెర్మ్ యొక్క జీవితం 2-3 రోజుల నుండి 6-7 రోజులు ఉండొచ్చు. సారవంతమైన సెర్వికల్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నట్లయితే స్పెర్మ్ యొక్క జీవిత కాలం మరింత తక్కువ కావచ్చు. అండోత్సర్గం జరిగిన రోజు లేదా దానికి ఐదు రోజుల లోపల లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే గర్భవతి కాగలరు.అంటే ఒక గుడ్డు అండోత్సర్గము జరిగిన 24 గంటలలో ఫలదీకరణం జరగినట్లయితే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.కనుక నెలసరులకు ఒక రోజు లేదా రెండు రోజుల ముందు గర్భం ధరించలేరు. ఆ రోజుల్లో దంపతుల లైంగిక సంబంధం ఎంతో సురక్షితం. మరి గర్భం ధరించాలని కోరుకునే వారు రుతు చక్రం యొక్క 11 నుండి 21 రోజుల మధ్య లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే సులభంగా గర్భం ధరించవచ్చు