అమ్మ : గర్భంతో ఉన్న మహిళకు షుగర్ వ్యాధి వస్తే తీసుకోవలిసిన జాగ్రత్తలు.. !!

Suma Kallamadi
మధుమేహం అనేది ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపొయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికి వస్తుంది.అయితే ఈ వ్యాధి గర్భిణీ స్త్రీలలో కూడా వస్తుంది. దీనినే మనం "జెస్టేషనల్ డయబెటిస్" అంటాము. ఎప్పుడయితే గర్భంతో ఉన్న మహిళ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయో అప్పుడు మీ బిడ్డకు హానికరం కావచ్చు. అందుకనే గర్భవతిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి.. ఈ వ్యాధి ఒక్కోసారి గర్భధారణ మొదటి దశలో రావచ్చు లేదంటే చివరి దశలో అయినా రావచ్చు.. అందుకనే ఎప్పటికప్పుడు మెడికల్ చెక్ అప్ చేయించుకోవాలి. మీరు గర్భధారణ సమయంలో  మధుమేహం గురించి ఎలా శ్రద్ధ వహించాలి అనే విషయాలు తెలుసుకుందాం.. !!

ముందుగా మీరు భయాన్ని దూరం చేసుకోవాలి. నాకు షుగర్ ఉంది పుట్టబోయే బిడ్డకు గాని,నాకుగాని ఏమైనా ప్రమాదం జరుగుతుందా అనే ఆలోచన నుంచి ముందు బయటపడండి. మీ భయమే మీ శత్రువు..కడుపుతో ఉన్న మహిళ ఎల్లపుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఆరోగ్యకరమైన బిడ్డను కనడానికి మీ గర్భధారణ సమయంలో మీ రక్తంలో గ్లూకోజ్ స్తాయిను సాధ్యమైనంత వరకు సాధారణంకు దగ్గరగా ఉంచటం అనేది మీరు చెయ్యవలిసిన అతి ముఖ్యమైనది.మీ భోజన ప్రణాళిక, శారీరక శ్రమ,అలాగే మందులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.కొంతమంది కడుపుతో ఉన్న మహిళలు చాలా అపోహలను నమ్ముతూ ఉంటారు. నాకు షుగర్ ఉంది పుట్టే బిడ్డకు కూడా షుగర్ వ్యాధి వస్తుందేమో అని కలవరపడతారు.

ఇక్కడ మీరు గమనించాలిసిన విషయం ఏంటంటే  ఒక గర్భవతి అయిన స్త్రీ యొక్క రక్తంలోని గ్లూకోజ్ ఆమె ద్వారా బిడ్డకు వెళుతుంది. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి గర్భధారణ సమయంలో చాలా ఎక్కువగా ఉంటే, జననం ముందు మీ బిడ్డ యొక్క గ్లూకోజ్ స్థాయి కూడా అలాగే ఉంటుంది. అయితే డెలివరీ తర్వాత బిడ్డ యొక్క గ్లూకోజ్ స్థాయి త్వరగా పడిపోయి చాలా తక్కువకు వెళ్లవచ్చు.అందుకని బిడ్డకు షుగర్ వ్యాధి వస్తుందన్న ఆలోచనని ముందు పక్కన పెట్టండి. అలాగే మీరు అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గించుకోడానికి ప్రయత్నించండి. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మానివేయాలి. అలాగే తినే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే నూనె పదర్ధాలు వాడకాన్ని తగ్గించండి.. శరీరానికి వ్యాయామం అనేది చాలా అవసరం.అలా అని బరువు పనులు చేయకూడదు. నడవడం లాంటివి చేయాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ సూచించిన మందులు వేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: