అమ్మ : గర్భిణీ స్త్రీ ఆరెంజ్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో చుడండి... !!
ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే తల్లి, బిడ్డ యొక్క రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బిడ్డ పుట్టాక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నన్సీ మహిళలు ఆరెంజ్ జ్యూస్ కచ్చితంగా తాగించాలి.ఆరెంజ్ పండ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఎదుగుదలకు ఎంతో అవసరం. అలాగే గర్భిణీ మహిళకు రక్తం పడడానికి కూడా ఆరెంజ్ అవసరం. అందువల్ల గర్భిణీలు నిత్యం ఆరెంజ్ పండు జ్యూస్ తాగాలి.ప్రెగ్నన్సీ సమయంలో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.
ఆ సమస్యను తగ్గించాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగడం మంచిది.అలాగే గర్భిణీ స్త్రీలకు శక్తి లేనట్లుగా, నీరసంగా అనిపించినప్పుడు ఆరెంజ్ జ్యూస్ తాగితే వెంటనే శక్తి వచ్చి ఉత్సాహంగా ఉంటారు.ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి వల్ల శరీరం ఐరన్‌ను బాగా గ్రహిస్తుంది.దీంతో బిడ్డ, తల్లి ఇద్దరికీ రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ మహిళలు నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగాలి.ఒకవేళ జ్యూస్ తాగని పక్షంలో ఆరెంజ్ పండుని అయిన తినాలి.. ఇంకొక ముఖ్య విషయం జ్యూస్ లో పంచదార తక్కువగా వేసుకుని తాగితే మరి మంచిది.. !!