కొబ్బరినూనెలో కర్పూరం కలపి వాడడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా.. !!
చర్మంపై ఏ విధమైన అలెర్జీ గాని,ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని ఉంటే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి ఆ ప్రదేశంలో రాసుకుంటే చర్మం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.ఇలా రెండు మూడు రోజులు చేశారంటే ఆ సమస్య తొలగిపోయినట్లే. అలాగే మీ ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కర్పూరం పొడి వేసి మచ్చలపై స్మూత్ గా మసాజ్ చేయండి. దీనివల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయి. కొబ్బరి నూనె, కర్పూరం రెండు కలిపిన నూనె చుండ్రు సమస్యను పరిష్కరించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది.కొబ్బరి నూనె అందమైన, ఆరోగ్యవంతమైన మెరిసే జుట్టును నిర్వహించడానికి సమర్థవంతంగా సహాయపడుతుంది.
ఇది మీ జుట్టుకు ఉత్తమ సహజ పోషకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాగే ఇప్పుడు చెప్పబోయే విషయం కొంత వింతే అయినా కానీ,ఈ టిప్ వల్ల ఉపయోగం చాలానే ఉంటుంది. ఒక్కోసారి తలలో పేల వలన భలే చిరాకు అనిపిస్తుంది కదా.అవి తలలో ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఏ పేలు తలలో ఉండడం వల్ల తల పొడి బారడం, తలలో దురద వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలను నివారించడంలో కర్పూరం చాలా ఉపయోగకరమైనది. కొద్దిగా కర్పూరంను నూనెలో వేసి గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేసి కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల తలలో పేల సమస్య తగ్గుతుంది..