అమ్మ : సిసేరియన్ అయ్యాక రెండో ప్రెగ్నన్సీ ఎప్పుడు వస్తే మంచిదో తెలుసుకోండి.. !!
సాధారణంగా మళ్ళీ గర్భం దాల్చేముందు కనీసం 18 నుండి 24 నెలల సమయం ఇవ్వాలని వైద్యులు చెబుతారు. పెద్ద ఆపరేషన్ తరువాత ఎంతలేదన్నా కనీసం ఆరు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక సిజేరియన్ జరిగిన మహిళ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పోగొట్టుకున్న రక్తం, న్యూట్రింట్స్ అన్ని సర్దుకుని స్త్రీ పూర్వ స్థితిలోకి రావాలంటే కొంత సమయం పడుతుంది. ఎంత అంటే చెప్పటం కష్టం. శరీర తత్వాన్ని బట్టి మారవచ్చు. ప్రసవం తరువాత తొందరగా గర్భవతి అయితే నార్మల్ డెలివరీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.నెలల నుంచి ఏడాది కాలం వరకు అసలు గర్భం అనే అలోచనే రాకూడదట. అదే 18 నుండి 24 నెలలు ఆగితే ఇంకా మంచిది.
ప్రమెచ్యూర్ ప్రసవం, బరువు తక్కువ ఉన్న బిడ్డ ఇలా ఏదైనా జరగవచ్చు. ఒక్కోసారి తల్లి ప్రాణం కూడా ప్రమాదంలో పడవచ్చు. అందుకే ఫ్యామిలి ప్లానింగ్ చాలా ముఖ్యం. కుదిరితే ఇద్దరు బిడ్డలకి మూడు సంవత్సరాల గ్యాప్ ఇస్తే బెటర్.ఆపరేషన్ అయ్యాక కనీసం ఒక సంవత్సరం అయినా ఆగితే మరి మంచిది. అలాగే రెండు ఆపరేషన్లు అయ్యాక మూడోది మంచిది కాదు. ఆపరేషన్ అంటే మహిళకు చాలా రక్తస్రావం అవుతుంది.మళ్ళీ కోలుకోవాలి అంటే చాలా రోజులు పడుతుంది..