అమ్మ : గర్భిణీ స్త్రీలు ఈ పండు తింటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం.. !!

Suma Kallamadi
అమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి మహిళ ఎదురుచూస్తుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసినప్పటి నుండి ఆ మహిళ తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కాదు. బిడ్డ ఆరోగ్యంగా పెరగాలని ఆహారం విషయంలో జాగ్రత్తలు వహిస్తుంది.అయితే హార్మోనుల మార్పుల వల్ల గర్భిణీ స్త్రీలలో మానసికంగా, శరీరకంగా కూడా మార్పులు జరగుతాయి. వీటిని ఎదుర్కోవాలంటే గర్భిణికి సరైన పౌష్టికాహారం అవసరం. గర్భిణీ స్త్రీలు తీసుకునే డైట్ లో అరటి పండు కూడా తీసుకోవాలి.  దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇది ప్రెగ్నన్సీ మహిళలకు లోపల పెరుగుతున్న బిడ్డకు ఇద్దరికీ చాలా మంచిది. అద్భుతమైన రుచి కలిగిన అరటి పండు ప్రెగ్నన్సీ మహిళలకు ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…




అరటిపండు మార్కెట్లో  విరివిగా దొరికే పండు. దీనిని గర్భిణీ స్త్రీలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గర్భం పొందిన తర్వాత ఎదుర్కొనే సమస్యల్లో అనీమియా ఒకటి. రక్తహీనత వల్ల ప్రవసం సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఒకవేళ ఆపరేషన్ చేయాలిసిన పరిస్థితి వస్తే ప్రసవ సమయంలో చాలా రక్తం పోతుంది . అందుకనే ఈ సమస్యను నివారించుకోవడానికి గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో అరటిపండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి.అలాగే అరటిలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అరటిపండు తినడం  అవసరం. దీని వల్ల రక్తహీనత సమస్య ఉండదు.




కడుపులో పెరిగే బిడ్డకు బ్రెయిన్, నాడీవ్యవస్థ, వెన్నెముక అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అరటి పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే పోలిక్ యాసిడ్ లోపిస్తే ప్రీమెచ్యుర్ బర్త్ అవుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా ఒక అరటి పండు తినడం వల్ల బేబి హెల్త్ కు చాలా మంచిది.ప్రెగ్నన్సీ సమయంలో ప్రతి స్త్రీ ఎదుర్కొనే సమస్య మలబద్దకం. అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: