పులిపిరులను తగ్గించే సహజ ఇంటి చిట్కాలు మీ కోసం.. !!

Suma Kallamadi
ఆడవాళ్ళని వేదించే సమస్యల్లో పులిపిర్లు ఒకటి.  ప్రతి వందమందిలో 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరులకు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇవి మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిర్లు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే చాలామంది ఆడవాళ్ళకి ముఖం మీద, మెడ మీద వస్తాయి. అవి చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. అలా అని పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వలన మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పులిపుర్లు మాడిపోవడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..





తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను పులిపిరికాయల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఈ ఉల్లిపాయ ముక్కలు తీసి పులిపిరికాయల మీద అప్లై చేయాలి. కొద్దిపేపు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.పులిపిర్ల నివారణకు అవిసె గింజలు బాగా సహపడుతాయి. అవిసె గింజల పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని పులిపిర్ల మీద అప్లై చేయాలి తర్వాత బ్యాండేజ్ చుట్టి సాయంత్రం తీసేయాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.




మరో ఎఫెక్టివ్ హోం రెమడీ వెల్లిల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.కర్పూరం ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పులిపిరికాయలను నివారిస్తుంది.పులిపిర్లు ఉన్న ప్రదేశంలో కర్పూరం ఆయిల్ ను అప్లై చేయాలి .పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ఆముదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదం నూనెను రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయాలి. వాటిని సాప్ట్ గా చేసి, రాలిపోయాలా చేస్తాయి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: