పైనాపిల్ ఇలా ఉపయోగిస్తే అందం మీ సొంతం.. !!
ప్రతి రోజు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ త్రాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.అలాగే పైనాపిల్ జ్యూస్ తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.పైనాపిల్లో ఉండే విటమిన్ సి అమైనో యాసిడ్స్ చర్మంలో ఉండే కొల్లాజన్ ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి చర్మాన్ని బిగువుగా, గట్టిగా చేస్తాయి. అలాగే చర్మంపై పేరుకొని ఉన్న మృతకణాలను తొలగించి చర్మం కాంతివంతంగా అయ్యేలా మారుస్తాయి. ఇందులో ఉండే సి విటమిన్ వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి. ఫలితంగా ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
అలాగే ఒక పైనాపిల్ స్లైడ్ ని తీసుకోని ముఖం మీద రుద్ది పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు, మొటిమలకు కారణం అయిన జిడ్డు తొలగిపోతుంది. పైనాపిల్ జ్యూస్ లో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం యవ్వనంగా కనపడటమే కాకుండా కాంతివంతంగా కూడా ఉంటుంది.పైనాపిల్ గుజ్జులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెదాలకు రాసుకుంటే, పెదాల్లో తేమనిచిలి ఉంటుంది. ఫలితంగా పెదవులు పొడిబారకుండా ఉంటాయి. దాంతో పెదాల్లో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి పెదాలు అందంగా, నునుపుగా ఉంటాయి.