మీ ముఖం రంద్రాలు, మొటిమలతో ఉందా.. !!అయితే ఈ చిట్కాలు మీకోసమే.. !!!
ఎందుకంటే పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనన్ని ఇస్తుంది.అందుకనే మొటిమలు, మచ్చలు పోవడానికి పుదీనా ఆకుల్లో రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని గుజ్జులాగా అయ్యాక ఈ మిశ్రమాన్ని ముఖం,మెడ భాగాలకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రాసుకుంటే మంచిది.. కనీసం ఇలా వారానికి మూడు సార్లు అయినాగాని చేస్తే మంచిది ఫలితం ఉంటుంది. అలాగే టమాటో అనేది మన చర్మానికి మంచి టోనర్ లా ఉపయోగపడుతుంది. మొటిమలు, మచ్చలు, పుండ్లు వంటి వాటిని తొందరగా నయం చేస్తుంది. ఒక రెండు లేదా మూడు తాజా టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో గుజ్జుని మొత్తం ముఖానికి రాసుకుని ఒక పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల చర్మం మీద ఏర్పడే పెద్ద రంద్రాలు క్రమంగా మూసుకుని పోతాయి.
అలాగే ముఖం పై ఎక్కువ మచ్చలు, రంద్రాలు ఉంటే ఆ ప్లేస్ లో కొంచెం టమాటో గుజ్జును రాసి ఒక గంట పాటు ఉంచి కడుకుంటే మచ్చలు తగ్గుతాయి. ఈ టమాటో గుజ్జులో పెరుగు కూడా వేసుకొని ముఖానికి రాసుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మీద ఉండే మృతకణాలు లాగే బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. అలాగే పసుపు కూడా మన చర్మానికి చాలా మంచిది. పసుపులో సహజంగానే ఏంటి బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ పసుపుకి కొంచెం పాలు జోడించి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం కాతివంతంగా మెరిసిపోతుంది..