అమ్మ : ఇలా చేస్తే డెలివరీ తర్వాత వచ్చే అధిక బరువును తగ్గించుకోవచ్చు..!!
బరువు కొన్ని రోజుల తరవాతైనా తగ్గొచ్చు. కాబటి ఈ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.ప్రతి రోజూ ఒక ఇరవై నిమిషాలు మీకోసం టైమ్ కేటాయించుకోండి. ప్రజెంట్ మీరు ఉన్న పరిస్థితిలో ఎన్నో విషయాలని బాలెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వకపోతే కష్టం. తీరుబడిగా వాకింగ్, ప్రేయర్, మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వడం, ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా స్నానం చేయడం. మీ ఇష్టం మీ ఇరవై నిమిషాలూ మీరెలా వాడుకుంటారో అలా మీకు ఇష్టమైన పనులు చేయండి. డెలీవరి తర్వాత మీరు, మీ పిల్ల కోసం హ్యాపీగా తినాలి. మీకు మాగ్జిమమ్ న్యూట్రిషన్స్ కావాలి
ఇప్పుడు హఠాత్తుగా ఫుడ్ తగ్గించడం మంచిది కాదు. దీని వల్ల బరువు పెరుగుతారు కూడా. ఒక్కోసారి మెటబాలిజం కూడా దెబ్బ తింటుంది. మీ ఫుడ్ హెల్దీ గా బాలెన్స్ గా ఉండేటట్లు చూసుకోవాలి. కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ బీ6, ఫోలేట్ మీరు తీసుకునే ఫుడ్ లో తప్పనిసరిగా ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీకు ఆకలి తీరాలి. రుచిగా ఉండాలి, శక్తినివ్వాలి. మీరు చేయగలిగిన పనులని నోట్ పెట్టుకోండి. ఆ పనులు మీరే చేసుకోవాలి. చిన్న చిన్న పనులకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదు. వారానికి అరకేజీ తగ్గితే మంచిది. అంత కంటే తగ్గితే పిల్లలకి పాలు సరిపోవు.అలాగే ఎక్కువగా నూనె పదార్ధాలు తినకపోవడం మంచిది.