అమ్మ : గర్భధారణ సమయంలో చేయవలిసిన, చేయకూడని పనులు.. !!
గైనకాలజిస్ట్ మిమ్మల్ని అనుమతించినట్లయితే మాత్రమే సెక్స్ చేయండి. మీ పిండం స్థానం ఒకవేళ కిందకి ఉన్నట్లయితే సెక్స్ చేయడం వల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగవచ్చు.
గైనకాలజిస్ట్ సూచించినటువంటి మీ ప్రినేటల్ సప్లిమెంట్లను జాగ్రత్తగా తీసుకోండి.
వ్యాధికారక వస్తువులు, హానికర పరిసరాలకు దూరంగా ఉండండి. ఆలాగే క్రమం తప్పకుండ మందులు వేసుకుంటూ ఉండాలి . సమయానికి ఆహారం తింటూ ఉండాలి. అలాగే గర్భధారణలో సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. !!ఇద్దరి కోసం తినాలనే ఆలోచనతో అతిగా తినడం మంచిది కాదు. ఒకవేళ తినాలంటే కొంచెం గ్యాప్ తీసుకుని కొద్దీ కొద్దిగా తినాలి. అలాగే గర్భవతిధూమపానం చేయడం కూడా మంచిది కాదు. మద్యం తాగడం చేయకూడదు.
బరువైన పనులు చేయడం, బరువు వస్తువులు మోయడం చేయకూడదు.తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు
అలాగే పచ్చి కోడిగుడ్లు, పచ్చి మాంసం తినవద్దు
కెఫిన్ ఎక్కువ తీసుకోకూడదు.డ్రగ్స్ కూడా తీసుకోకూడదు. వీటివల్ల బిడ్డకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
గర్భధారణలో డెయిటింగ్ చేయడం, అధిక వేడి నీటి స్నానం కూడా చేయకూడదు.వైద్యుడు సూచించని మందులు అసలు వేసుకోకూడదు. మరో ముఖ్య విషయం ఏంటంటే
అధిక ఒత్తిడికి గురికాకుండా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు.. !!