అమ్మ : గర్భనిరోధక మాత్రలు వాడడం మంచిదేనా..?? అసలు ఈ పిల్స్ ఎలా వాడాలో చుడండి.. !!
అసలు ఈ బర్త్ కంట్రోల్ పిల్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం..!! బర్త్ కంట్రోల్ పిల్ లో ఉండే హార్మోన్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తాయి.ఈ పిల్స్ ఆడవాళ్ళ ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఆపుతాయి.అలాగే ఈ పిల్స్ సర్వైకల్ మ్యూకస్ ను థిక్ గా చేయడం ద్వారా స్పెర్మ్ యుటెరస్ లోకి ప్రవేశించకుండా ఆపుతాయి.ఈ పిల్స్ ఎలా తీసుకోవాలంటే... బర్త్ కంట్రోల్ పిల్ రకరకాల డోసింగ్ పాకెట్స్ లో లభిస్తుంది. 21 రోజుల పిల్ పాకెట్స్ నుండీ 365 రోజుల పిల్ పాకెట్ వరకూ ఉంటాయి. ట్రెడిషనల్ గా, బ్రాండ్ ని బట్టీ డోస్ ని బట్టీ మూడు వారాలు యాక్టివ్ పిల్ తీసుకోవాలి. రెండు నుండి ఏడు రోజుల పాటు ఇనాక్టివ్ పిల్ తీసుకోవాలి. దీన్ని సైక్లికల్ డోసింగ్ అంటారు. చాలా మందికి ఈ ఇనాక్టివ్ తీసుకుంటున్న టైం లో పీరియడ్ వచ్చేస్తుంది. కొన్ని బ్రాండ్స్ అసలు ఇనాక్టివ్ పిల్ నే ప్రొవైడ్ చేయవు. ఆ పాకెట్ లో కేవలం ఇరవై ఒక్క రోజులకి సరిపడే పిల్స్ మాత్రమే ఉంటాయి. అంటే, ఒక వారం పాటూ ఏ పిల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్న మాట.
ఈ పిల్స్ వాడడం వల్ల కొన్ని డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి.. బర్త్ కంట్రోల్ పిల్స్ ఎస్టీడీల (సుఖ వ్యాధులు ) నుండి రక్షణ కల్పించవు. ఇవి కేవలం ప్రెగ్నెన్సీ ని ప్రివెంట్ చేస్తాయంతే. ఎస్టీడీ నుండి రక్షణ కోసం కండోమ్ ఉపయోగించాలి. కండోమ్ వాడుతున్నారు కదా అని పిల్ తీసుకోవడం మానేయకూడదు. పిల్ రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే పిల్ ఎఫెక్టివ్ గా పని చేయదు.ఈ పిల్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అవేంటంటే బ్రెస్ట్ టెండర్నెస్, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, వికారం, పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్. చాలా వరకూ రెండు మూడు నెలల్లో ఇవన్నీ సర్దుకుంటాయి.ఒకవేళ బాగా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం డాక్టర్ తో చెప్పడం మంచిది.