అమ్మ : అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి.. !
తరువాత మీరు మీ చేతులు, వీపు నొప్పి కలుగకుండా మీ బిడ్డను పట్టుకునే స్థితిలో కూర్చునేలాగా ఒక సౌకర్యవంతమైన స్థలం చూసుకోండి. మీ వీపుకు ఆధారం ఉండునట్లుగా చూసుకోండి మరియు మీరు వెనుకకు వాలిపోకుండా చూసుకోండి. మీ బిడ్డను సరిగ్గా ఎత్తుకోవడంలో సహాయపడడం కొరకు దగ్గరలో కొన్ని దిండ్లు లేదా దుప్పట్లను ఉంచుకోండి. వివిధ భంగిమలను ప్రయత్నించండి. చాలా మంది తల్లులకు, వారి రొమ్ముల మధ్య వారి బిడ్డను ఊయలలాగా ఉంచుకుని, ఒక మెత్తటి దిండు పైకి పట్టుకునే భంగిమ సరియైనదిగా ఉంటుంది. లేదా మీ బిడ్డను మీ చేతులక్రింద పట్టుకుని, బిడ్డ పాదాలు వెనుకకు ఉండునట్లుగా, తల రొమ్ములవద్ద ఉండునట్లుగా పట్టుకోండి. మీకు ఏది ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుందో దానిని చేయండి.
మీరిద్దరూ విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు, మీ బిడ్డ మీ రొమ్మును తన నోటితో పట్టుకుని, పాలుత్రాగడానికి తగిన సమయం. మీ బిడ్డ పాలుత్రాగడానికి 5 నుండి 40 నిమిషాలు పట్టవచ్చు. ఒకవేళ శబ్దం వలన అంతరాయం కలిగితే, నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి. మీకు విసుగ్గా ఉంటే, రేడియో లేదా టివి ఆన్ చేసి లేదా ఒక మిత్రుడు లేదా బంధువుతో పాటుగా కూర్చుని చనుబాల నివ్వండి.అలాగే ఎక్కువసేపు ఒకే రొమ్ము నుంచి పాలు ఇవ్వడం మంచిది కాదు.. కొంచెం సేపు ఒక పక్కా, కొంచెం సేపు మరో పక్కా పాలు ఇస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల రొమ్ముల్లో గడ్డలు కట్టకుండా ఉంటాయి.. !!