జిడ్డు చర్మం కలవారు ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేసి చుడండి.. !!

Suma Kallamadi
ఆడవాళ్లు అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.ముఖ కాంతిని పెంచుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అయినాగానీ ఫలితం ఉండదు. అయితే చాలామంది ఆడవాళ్ళ ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది. అలా జిడ్డు కారుతూ ఉండడంతో వాళ్లకి ఏమి చేయాలో తోయదు. అందుకనే  చర్మంపై నూనెను నియంత్రించడానికి బయట మార్కెట్లో  అనేక ఉత్పత్తులను లభిస్తాయి అయినప్పటికీ, రసాయనంతో నిండిన ఉత్పత్తులను ఉపయోగించడం కంటే ప్రకృతి అందించే సహజ సిద్ధమైన చిట్కాలను ప్రయత్నించడం ఎల్లప్పుడూ మంచిది.  కాబట్టి, మీ ముఖం నుండి నూనెను తొలగించడంలో మీకు సహాయపడే  కొన్ని అద్భుతమైన ఫేస్ ప్యాక్ లు మీకు అందిస్తున్నాము వీటిని ఉపయోగించడం వల్ల మీ ముఖం పై ఉండే అదనపు నూనెను జిడ్డుగల చర్మం తొలగించి మీ చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మారుస్తాయి.

జిడ్డుగల చర్మం ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా  ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రపరుచుకోవాలి. అలాగే జంక్ ఫుడ్,  ఎక్కువ నూనె ఆహారం,  మిరప-కారంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ప్రాణాయామం చేయండి.ముఖాన్ని మంచినీటితో రోజుకు 3-4 సార్లు కడగాలి.(కొంతమంది మొఖం పై జిడ్డు ఎక్కువగా ఉంది అని ఫేస్ వాష్ ఉపయోగించి రోజుకి 4 నుంచి 7 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటారు దీనివల్ల చర్మం పై జిడ్డు ఇంకా ఎక్కువ  అవే అవకాశం ఉంటుంది కాబట్టి రోజూ కి 1-2 సార్లు మాత్రమే ఫేస్ వాష్ చేసుకోండిరోజ్ వాటర్ సహజంగా ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మంలోని నూనెను తగ్గించి చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, రోజ్ వాటర్‌లో  కాటన్ బాల్ లేదా కాటన్  ముక్కను నానబెట్టి ముఖాన్ని శుభ్రపరచండి. ఇలా చేయడం ద్వారా, ముఖ చర్మం వికసిస్తుంది చర్మం లో ఉండే జిడ్డుని పూర్తిగా తొలగిస్తుంది.




ముల్తానీ మిట్టి జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో ఉండే పుష్కలమైన ఖనిజాలు జిడ్డుగల చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి ముల్తాని మిట్టి ఫేస్ ప్యాక్ చర్మం నుండి నూనెను గ్రహిస్తుంది. గిన్నెలో ముల్తానీ మిట్టి రెండు టీస్పూన్లు తీసుకుని దానికి ఒక చెంచా తాజా పెరుగు, రెండు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో తీసుకునే పేస్ట్ ఏర్పడే వరకు కలపాలి. ఇప్పుడు ముఖాన్ని నీటితో బాగా కడిగి టవల్ తో శుభ్రం చేసుకోండి.
దీని తరువాత, మీ ముఖం అంతా ఈ ఫేస్ ప్యాక్ ను రాసుకోండి. ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిపోయినప్పుడు, ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ముఖం కడిగిన తరువాత ఏదైనా మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ రాయండి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: