నారింజతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.. !!

Suma Kallamadi

 ఈ కాలంలో చాలా మంది ఆడవాళ్లు బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయి అందం గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. ఏదన్న ఫంక్షన్ ఉన్నపుడు మాత్రం ముఖానికి మెరుగులు దిద్దుతారు తప్పా మిగతా రోజుల్లో పట్టించుకోవడం మానేస్తారు. మార్కెట్లో దొరికే ఎదో ఒక క్రీమ్ తెచ్చుకుని రాసుకుంటారు. అది చర్మానికి సరితూగుతుందా లేదా అని కూడా ఆలోచించరు.ఫలితంగా ముఖం కాంతి హీనంగా తయారవుతుంది  కాస్త మీ లైఫ్ లో  కొంచెం సమయాన్ని మీ అందాన్ని కాపాడుకోవడానికి వెచ్చించండి..ఎటువంటి కెమికల్స్ లేని సహజ సిద్ద పద్దతులతో మీ ముఖ కాంతిని రెట్టింపు చేసుకోండి.. !! మార్కెట్లో దొరికే నారింజ కాయతో అందాన్ని కాపాడుకోవచ్చు తెలుసా.  అది ఎలానో తెలుసుకుందాం.. !!

నారింజ కాయని  రెండు ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో రెండు టేబుల్ స్పూన్ల  పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కాకుండా జిడ్డుతనం పోయి మృదువుగా,  కాంతి వంతంగా కూడా అవుతుంది. అలాగే రెండు  టేబుల్ స్పూన్ల  నారింజ రసంలో, ఒక టేబుల్ స్పూన్  
తేనె,1 టేబుల్ స్పూన్ నిమ్మ  రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలు తగ్గుతాయి.  అలాగే మచ్చ రహితమైన, అంటే మచ్చలు లేని పరిశుభ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది.

నిమ్మ కాయ బయట ఉండే తొక్కని పొడిగా చేసి అందులో, గంధం పొడిని జతపరిచి, పాలు\నీళ్ళూ\రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ గా అయిన తరువాత ముఖానికి పట్టించి పొడిగా మారిన తరువాత అంటే ఒక 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తటి టవల్ తో శుభ్రం చెసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. !! కనీసం వారం రోజులకు ఒక రెండు సార్లైనా ఇలా చేస్తూ ఉంటే చర్మం అందంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: