అమ్మ: ప్రెగ్నెన్సీ సమయంలో ఇవి తింటే పుట్టే పిల్లలపై ఎఫెక్ట్..?

N.ANJI
మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు తీసుకునే ఆహారం పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆమె తినే ఆహారం శిశువుకి వెళుతోంది. కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీలు ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సార్లు కొన్ని ఆహార అలవాట్లు శిశువుకు హానీ కలిగిస్తాయని తెలియదు.

సర్వసాధారణంగా చెక్కరను అందరు ఇష్టపడతారు. అయితే గర్భధారణ సమయంలో చెక్కర అధికంగా తీసుకోవటం శిశువుకు మంచిది కాదనే విషయం మనలో చాలా మందికి తెలీదు. ఇక గర్భధారణ సమయంలో స్త్రీలకు ఆహారం విషయంలో అనేక కోరికలు కలుగుతాయి. కానీ కొన్ని అలవాట్లని నియంత్రించు కోవాలి లేకుంటే శిశువుకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల చెక్కర విషయంలో బిడ్డ ఆరోగ్యం కోసం తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ తొమ్మిది నెలల ప్రయాణంలో రుచుల విషయంలో ఐస్‌క్రీమ్ లేదా చాక్లెట్లు వంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి చాలా మంది మహిళలు ఇష్టపడతారు. కానీ ఇలా తినడం వల్ల మీకు, మీ బిడ్డకు మంచి కంటే ఎక్కువ శాతం హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీలు చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల తల్లి, బిడ్డకు ఊబకాయం సమస్యకి దారితీస్తుందని పరిశోధనలో తేలింది. చక్కెర తియ్యటి పానీయాలు ఎక్కువగా తాగిన గర్భిణీ స్త్రీలకు 7 ఏళ్ళ వయసులో ఉబకాయం కలిగి ఉంటారు. అయితే చక్కెర పిల్లలలో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. చక్కెర పిల్లలలో జీవక్రియ సమస్యలను కలిగిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు అనేక రకాలైన ఆహారాలు తినాలని అనిపిస్తాయి కానీ ఆ సమయంలో స్వీట్స్ తినాలన్న కోరిక అధికంగా ఉంటె ఆ సమయంలో పండ్లు, షేక్స్ మరియు పండ్ల రసాలను తీసుకోవచ్చు. మీకు నిజంగా ఐస్‌ క్రీమ్‌ లు లేదా చాక్లెట్లు తినాలని అనిపిస్తే వాటిని మితంగా తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: