20 ఏళ్లలో 40 సార్లు బదిలీ.. జయలలిత స్నేహితురాలు శశికళకే చెమటలు పట్టించింది..
ప్రభుత్వ ఉద్యోగం అన్న తరువాత ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణమని, ఈ ఉద్యోగం ఇదో భాగమని అన్నారు. 20 ఏళ్ల తన కెరీర్లో తన వ్యక్తిత్వంలో ఎటువంటి మచ్చ లేదని ఆమె చెప్పారు. నిజానికి తన వృత్తిలో కొనసాగుతున్న చాలా మంది అధికారులు అనేక అంశాల జోలికి వెళ్లకూడదని అనుకుంటూ ఉంటారని, అలా అయితే బదిలీలు కాకుండా ఒకేచోట ఉండొచ్చని రూప తెలిపారు. కానీ తాను వారి మాదిరి ఉండలేనని, వృత్తిలో భాగంగా ఏ విషయానికి ఎలా స్పందించాలో ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చానని ఆమె చెప్పారు. కాగా.. రూప మొట్టమొదటి సారిగా వార్తల్లోకి ఎప్పుడు వచ్చారంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సన్నిహితులరాలు శశికళపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి.
ఆ ఆరోపణలు చేసింది మరెవరో కాదు రూపనే. ఈ ఘటనలో రూపపై రూ. 10 కోట్ల పరువు నష్టం కేసు కూడా వేశారు. అయినప్పటికి రూప వెనుకంజ వేయలేదు. తాను ఏ ఆరోపణ అయినా సరైనా సాక్ష్యాలు లేకుండా చేయనంటూ ముందుకు సాగారు. ఇలా అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా రూప తన కెరీర్లో నిజాయితీ పరురాలుగా కొనసాగారు. 2016, 2017లలో పోలీసు విభాగంలో అందించే రాష్ట్రపతి పురస్కారాలను కూడా అందుకున్నారు. బ