అమ్మ: గుమ్మడి గింజలతో గర్భిణీలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఇక గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారంపైనే శిశువు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ తినాలా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. గర్భధారణ సమయంలో గుమ్మడికాయ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండగా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇక గుమ్మడికాయ పోషణకు మంచి మూలం. ఇందులో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్, భాస్వరం ఉన్నాయి మరియు శిశువు తల్లికి అవసరమైన అన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గర్భం దాల్చిన స్త్రీలలో ముఖ్యంగా కనిపించే సమస్య జీర్ణక్రియ రేటు తగ్గిపోవడం, మలబద్ధకం, ఎసిడిటీ, అధిక రక్తపోటు ఇవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలు అన్నింటిని కూడా మనం ఈ గుమ్మడికాయ గింజలతో చెక్ పెట్టొచ్చు.
గర్భధారణ సమయంలో అతి సాధారణ సమస్యలలో అతిసారం ఒకటి. కాబట్టి గర్భధారణ సమయంలో మీరు తినే గుమ్మడికాయ ప్రేగులలోని పురుగులను తొలగించి కడుపును శుభ్రపరుస్తుంది. గుమ్మడి గింజలలో అధిక శాతం ఫైబర్, జింక్ మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, బి, క్యాల్షియం, ఫ్యాటి ఆసిడ్లు మెండుగా ఉంటాయి. గుమ్మడి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ రేటును మెరుగు పరచడంతో పాటు, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉన్న కాల్షియం, ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా చేకూరుస్తాయి అలాగే శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
అంతేకాకుండా మహిళలు గుమ్మడి కాయ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి గుమ్మడికాయ ఎంతో సహాయపడుతుంది. ఇక ఇందులో ఉన్న జింక్ జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే గుమ్మడికాయను స్వీట్లలో కాకుండా ప్రత్యేకంగా ఉడికించి తినడం మంచిదని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: