అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై వెనక ఇంత కన్నీటి గాద ఉందా..?..? ఇన్ స్పైరింగ్ స్టోరీ..!
శిరీష తండ్రి కొత్తూరు అప్పారావు తాపీ మేస్త్రీగా పనిచేసేవారు. తల్లి రమణమ్మ రోజువారీ ఉద్యోగిగా పనిచేసేది. ఆర్థిక పరిస్థితుల వల్ల శిరీషకి పదమూడేళ్ల వయసులోనే పెళ్లి చేశారు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులో వివాహం చేసుకున్న శిరీష.. తర్వాత అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసేంది. తల్లిదండ్రుల వద్దే మళ్లీ చదువుకోవడం ప్రారంభించింది.
శిరీష తండ్రి అప్పారావుకి పోలీసులంటే ఇష్టం. కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా శిరీషని చూడాలనుకున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో ఎం ఫార్మసీ పూర్తి చేసింది. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించింది. అయితే ఆమె కానిస్టేబుల్ గా ఉన్న సమయంలో ఓ ఎస్పీ.. ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ అని అన్నాడట. ఇది చిన్నతనంగా అనిపించిన శిరీష.. 8 నెలల పాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలవు పెట్టింది. తాను సంపాదించిన ఒకటిన్నర లక్షలతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఇన్ స్టిట్యూట్ లో చేరింది. శిక్షణ తీసుకుంది. 2019లో ఎస్ ఐ గా ఎంపికైంది. శిరీషని ఆఫ్ట్రాల్ అన్న ఎస్పీ కూడా విశాఖపట్నం లో జిల్లా పరిషత్ లో శిరీషకి సన్మానం చేశారు. ఇప్పుడు శిరీష లక్ష్యం డీఎస్పీ.. అందుకోసం శిరీష ప్రయత్నాలు చేస్తుంది.
అనాథ శవాన్ని మోసిన శిరీష ఫోటోలు వైరల్ అవడంతో అందరూ ప్రశంసించారు. హోం మంత్రి సుచరిత, ఎంపీ విజయసాయిరెడ్డి , తెలంగాణ పోలీసులు, బండి సంజయ్ ప్రశంసించారు. ఇవన్నీ తాను జీవితంలో మర్చిపోలేని తీపి గుర్తులని శిరీష అంటోంది.