మైనర్ అమ్మాయిని పాడు చేసిన వాడిని సముద్రాలు దాటి లాక్కచ్చి కోర్టు బోను లో నిలబెట్టిన లేడీ సింగం
మెరిన్ జోసెఫ్ కేరళకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 2012 బ్యాచ్ కి చెందిన ఆమె.. కేరళ రాష్ట్రంలో కొల్లంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించింది. ఛార్జ్ తీసుకోగానే పాత కేసుల తాలూకు ఫైల్స్ ని ఓపెన్ చేసింది. వాటిలో ఓ కేసు ఆమెను బాగా కదిలించింది. మైనర్ బాలికను సునిల్ కుమార్ అనే దుర్మార్గుడు మూడు నెలల పాటు లైంగికంగా వేధించాడు. తన కోరికలు తీర్చుకున్నాడు. అతనిపై బాలిక తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. సునీల్ కుమార్ భారతదేశం వదిలి దుబాయ్ పారిపోయాడు. ఇక చేసేది లేక పోలీసులు కేసును క్లోజ్ చేశారు.
బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి తలచుకుని బాధపడింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజులకు బాలిక తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు మెరిన్ జోసెఫ్ ని కదిలించింది. ఓ కుటుంబం చావుకు కారణమైన సునీల్ ని ఎలాగైన పట్టుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఢిల్లీ సీబీఐ కార్యాలయాన్ని సంప్రదించింది.
దుబాయ్ లో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి సహకరించాలని కోరింది. చివరకు తానే ఓ టీం తీసుకుని దుబాయ్ వెళ్లింది. ఇండియన్ ఎంబసీ సహకారంతో నిందితుడిని పట్టుకుంది. కేరళ తీసుకొచ్చి జైలులో పడేసింది. పకడ్బందీగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సునీల్ కి త్వరలో శిక్ష ఖరారు కానుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో అవినీతి పోలీసులే కాదు.. మెరిన్ జోసెఫ్ లాంటి సిన్సియర్ ఆఫీర్లు కూడా ఉంటారని నిరూపించింది.