అమ్మ: డెలివరీ తర్వాత వీటిని తినడం మానేయండి..!?

N.ANJI
గర్భధారణ సమయంలో చాల మంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక గర్భధారణ సమయంలో గర్భిణులు కొన్ని ఆహార పదార్దాలకు దూరంగా ఉంటారు. అయితే ప్రసవం అయ్యాక కూడా వాటికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.  ఇక పుట్టిన బిడ్డకు పాలిచ్చేటప్పుడు మీ శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు అవసరమని గుర్తించుకోండి. దీనికి గాను మీ రోజువారీ ఆహారంలో పాలు, జ్యూస్, మిల్క్ షేక్స్ వంటి ద్రవాలను క్రమం తప్పకుండా చేర్చండి. ఈ సమయంలో ఎక్కువ నీరు త్రాగడం కూడా చాలా అవసరం. కాబట్టి, ప్రతి రోజూ మీరు కనీసం 6 నుంచి 8 గ్లాసుల మంచి నీరు తాగాల్సి ఉంటుంది.
అయితే పిల్లలు పుట్టిన తరువాత, మీ శరీరం సాధారణ స్థితికి చేరుకోవాలంటే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీ శరీర బరువును బట్టి, బలాన్ని తిరిగి పొందడానికి, తగిన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలని గుర్తించుకోండి. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉన్నట్లైతే మరింత అదనపు ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని గుర్తించుకోండి.
అంతేకాక మీ రోజువారీ భోజనంలో కనీసం సగం ప్లేట్ పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. వీటితో పాటు మాంసకృత్తులు కూడా ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు మీకు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. అంతే కాదు.. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
ఇక తల్లి పాల ద్వారానే బిడ్డకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఈ సమయంలో ఎలాంటి పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. అందుకే పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవడంతో పాటు విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారం, సప్లిమెంట్లు తీసుకోవాలనే విషయంపై మీ వైద్యుడిని సంప్రదించండి.
అయితే జంక్ ఫుడ్ తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఎలాంటి పోషకాలు అందవు. పైగా తరచూ దీన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, డెలివరీ తర్వాత జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం ఉత్తమం. అంతేకాక, శిశువుకు పాలివ్వాల్సిన మహిళలు కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం కూడా పూర్తిగా తగ్గించాలి. కెఫీన్, ఆల్కహాల్ శిశువు మెదడు అభివృద్ధిని అడ్డుకుంటాయి. వీటివల్ల బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: