మిస్ ఇండియా ఫైనలిస్ట్ నుండి సివిల్ 93 రాంక్ వరకు ఐశ్వర్య వాడిన 10+8+6 టెక్నిక్ ఏంటో తెలుసా..?
ఆలా ఐశ్వర్య 2018 సంవత్సరం నుండి యూపిఎస్సి పరీక్షలకు చదవడం మొదలు పెట్టింది .ఆలా చదివి 2019 సంవత్సరం లో ఐశ్వర్య యూపిఎస్సి వారు నిర్వహించిన సివిల్స్ పరీక్షలను రాసారు. అయితే ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు గత సంవత్సరం ఆగష్టు నెలలో విడుదలైయ్యాయి. ఇందులో ఐశ్వర్య ఉత్తీర్ణులు అవడంతో పాటుగాదేశం మొత్తం లో 93వ ర్యాంక్ కూడా పొందడం విశేషం. అది కూడా తొలి ప్రయత్నంలోనే ఐశ్వర్య ఈ ర్యాంక్ సాధించడం అంటే మాములు నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.
అయితే ఐశ్వర్య సివిల్ సర్వీసెస్ పరీక్షలకు చదవడం కోసం ఒకప్రణాళికను అవలంబించింది అదేంటంటే 'పది గంటల' ప్రిపరేషన్, 'ఎనిమిది గంటల' నిద్ర,' ఆరు గంటల' ఇతర కార్యక్రమాలు. ఇది ఆమె యొక్క ప్రణాళిక ఇలా రోజు చేయడం వల్ల ఐశ్వర్య అంతటి సివిల్ ర్యాంక్ ను సాధించగలిగింది. మరో విషయం ఏమిటంటే ఎవరైనా సివిల్ సర్వీసెస్ కి సన్నద్ధం అవడం కోసం బయట కోచింగ్ లు తీసుకుంటారు కానీ, ఐశ్వర్య ఎక్కడ కోచింగ్ తీసుకోలేదట ఈ విషయం లో ఆమె ఒక పోలీస్ ఉన్నతాధికారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యిందట.అలాగే ఇంటర్వ్యూ విషయం లోను ఓ పోలీస్ ఉన్నతాధికారి వలనే దైర్యం గా ఇంటర్వ్యూ లో పాల్గొన్నానని ఆమె తెలిపింది. అయితే ఈ యుపిఎస్సి పరీక్షలలో విజయం సాధించాలంటే ఎప్పుడు ఏకాగ్రతగా ఉండాలని చదువు తప్ప వేరే ద్యాస ఉండకూడదని ఆలా ఉంటె ఏదైనా సాధించగలమని ఆమె చెబుతోంది.