కూతురిపై తండ్రి.. కోడలిపై మామ అత్యాచారాలు
నేరాలు - ఘోరాలు..
కామాంధుల కీచక పర్వాలు
కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. దేశంలో ప్రతిరోజు, ప్రతి గంటకు ఏదో ఒక ప్రాంతంలో, ఎక్కడో ఒకచోట ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. అబలలు బలైపోతూనే ఉన్నారు. పురుషుడు కూడా వావి వరుసలు మరిచి రూపానికి స్త్రీగా కనపడితే చాలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నాడు.
కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి
తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలో కన్నకుమార్తెను గర్భవతిని చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కమార్తె 9వ తరగతి చదువుతోంది. తొమ్మిది నెలల నుంచి తండ్రి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లిన ఆ బాలిక కడుపు ఉబ్బెత్తుగా ఉండడం గమనించిన ఉపాధ్యాయులు ఆమెను కామక్కూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రా నికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా, బాలిక ఎనిమిది నెలల గర్భవతిగా నిర్థరణ అయింది. ఈ విషయమై బాలిక అవ్వ ఆరణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని అరెస్టు చేసి ఆరణి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి మహాలక్ష్మి ఎదుట హాజరుపరిచారు. అనంతరం వేలూరు జైలుకు తరలించారు. కుమార్తెనే గర్భవతిని చేసిన కీచక తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, కఠినశిక్ష పడేలా చూడాలంటూ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినతులు పోలీసులకు అందాయి.
కోడలిపై మామ అత్యాచారం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ కీచక మామ తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కోడలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఢిల్లీలో వ్యాపారం చేస్తూ మంచి సంపాదనలో ఉన్న మామ వ్యాపార నిమిత్తం దుస్తులు కొనుగోలు చేసేందుకు కోడలితో కలిసి ఢిల్లీలోని చలాస్థామ్ ప్రాంతం నుంచి వచ్చాడు. నాంపల్లిలోని ఒక హోటల్లో అద్దెకు దిగారు. మామయ్యే కాబట్టి కోడలికి ఎటువంటి సందేహం రాలేదు. వ్యాపార పనుల నిమిత్తమని తను కూడా వచ్చింది. ఇంటివద్ద బుద్ధిగా ఉండే మామ నాంపల్లి హోటల్ గదిలో అర్థరాత్రి సమయంలో కామ పిశాచిగా మారాడు. 21 ఏళ్ల కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. అయితే కోడలు తెల్లవారుజామున పోలీస్ ష్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆమె మామను అరెస్ట్ చేశారు.