అమ్మ: గర్భిణులు వ్యాయామం వల్ల పిల్లల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..!
అయితే గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఊబకాయం ఉన్న తల్లి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. మధుమేహం నుంచి పిల్లలు రక్షింపబడతారని ఎలుక మీద చేసిన ప్రయోగం ద్వారా తెలిసిందని చెప్పారు. తల్లికి ఊబకాయం ఉంటె.. గర్భస్థ సమయంలో చేసే వ్యాయామం పిల్లను మధుమేహం నుంచి కాపాడుతుందని తమ అధ్యయనాల్లో తేలిందని చెప్పారు.అయితే తండ్రికి ఊబకాయం అంటే అనే ప్రశ్న కు సమాధానం కూడా చెప్పారు.
ఇక ర్భధారణ సమయంలో చేసే వ్యాయామం ఆరోగ్యకరమైన శిశువు జన్మిస్తుందని.. గర్భధారణ సమస్యలు మరియు అకాల ప్రసవాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఇదే విషయం పై కండరాల పరిశోధన డైరెక్టర్ యాన్ మాట్లాడుతూ.. గర్భిణీ చేసే వ్యాయామం తో పిల్లల జీవితమంతా ఆరోగ్యంగా ఉంటారా.. మధుమేహం, జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి రక్షింపబడతారా తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు ఎలుకపై ప్రయోగాలు చేస్తున్నామని తెలిపారు.
అయితే వాస్తవానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలలను, అలాగే శిశువు యొక్క హృదయ స్పందనను అనుభవిస్తారు. గర్భం అనేది ఒక అసాధారణమైన సమయం, దీనిలో శరీర వ్యవస్థలన్నీ తల్లి మరియు బిడ్డల మధ్య సంబంధాన్ని పెంపొందించుకుంటాయి.