అమ్మ: గర్భిణీలపై కరోనా మహమ్మారి ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందా..!?

N.ANJI
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే గర్భిణీలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తాజా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే గర్భిణీలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తాజా అధ్యయనాల్లో తేలింది. కరోనా వచ్చాక శిశువుల సంఖ్య, ప్రసూతి మరణాల రేటు దాదాపు మూడో వంతు పెరిగిందని తేలింది.

అయితే గతంతో పోలిస్తే కోవిడ్ తర్వాత కేవలం జీవం లేకుండా పుట్టిన వారి సంఖ్య 25 శాతం పెరిగిందని మొత్తం 40 అధ్యయనాల్లో 12 నివేదికల్లో తేలింది. రెండు నివేదికల్లో ప్రసూతి మరణాలు వృద్ధి చెందాయని తేల్చింది. అందులో ఒకటి భారత్ కాగా.. రెండోది మెక్సికో రిపోర్టు. ఈ రెండు నివేదికల ప్రకారం మూడో వంతు ప్రసూతి మరణాలు పెరిగాయని పేర్కొన్నాయి. గర్భధారణ గురించి మెక్సికో అధ్యయనం ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది.

ఇక ప్రస్తుతం భారత్ లో కోవిడ్-19 వల్ల ప్రసూతి మరణాలు రేటు 1.3 శాతంగా ఉందని, అందులోనూ కాస్త వయసు పైబడిన తర్వాత గర్భం ధరించే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. కరోనా వల్ల మరణించే గర్భిణుల సంఖ్య మిగిలినవారిలాగే తక్కువగానే ఉన్నా... లాక్ డౌన్ వల్ల ఆసుపత్రుల్లో కేసులు అధికంగా ఉండడం వల్ల జరిగిన ఆలస్యం కారణంగా గర్భ సబంధిత సమస్యలతో మరణించే వారి సంఖ్య పెరిగిందని అధ్యయనకారులు తెలిపారు.

ఇంకా జన్మించకుండానే కడుపులోనే మరణించిన శిశువుల సంఖ్యను ఈ జాబితాలో లెక్కించకపోవడం దరదృష్టకరమని వారు అన్నారు. ఆసుపత్రుల్లో స్టిల్ బర్త్స్ కోసం రిపోర్ట్ వ్యవస్థ ఉన్నప్పటికీ సామాజిక స్థాయిలో లేదని ఆయన స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో రోజూ కేసుల సంఖ్య ఎక్కువవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నా.. కేసుల పెరుగుదల అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులతో పాటు గర్భిణీలపై ప్రభావం చూపుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: