అమ్మ: ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లేనంటా..!

N.ANJI
పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంటారు. ఇక పెగ్నెంట్‌ అని తెలియగానే సంబరపడతారు. అయితే గర్భిణులకు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా అవగాహన కలిగి ఉండరు. గర్భవతిగా ఉన్నప్పుడు తినే తిండి దగ్గరి నుంచి తాగే పానీయాలు, చేసే ప్రతి పనిలోనూ ఎంతో ఆచితూచీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక నెలలు నిండితున్న కొద్ది పుట్టేది అమ్మాయా.. అబ్బాయా అన్న ఉత్సుకత పెరుగుతుంది. కానీ లింగనిర్థారణ పరీక్షలు  చేయించడం చట్టరీత్యా నేరం కాబట్టి డాక్టర్లు ఎవరు ఆపని చేయరు. అయితే పెద్దలు మాత్రం గర్భాన్ని చూసి పుట్టేది అమ్మాయో, అబ్బాయో చెప్పేస్తారు. అయితే ఇప్పుడెలాంటి పరీక్షలు చేయకుండానే గర్భంలో ఉన్నది మగ, ఆడ అన్నది చెప్పేయచ్చు అంటున్నారు. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. గర్భాధారణ సమయంలో స్త్రీలు ఒత్తిడికి లోనైతే ఆడపిల్ల పుడుతుందని ఓ పరిశోధనలో తేలింది.

అయితే గర్భవతి కావడానికి ముందు, గర్భధారణ సమయంలో అధిక ఒత్తిడిని అనుభవించే స్త్రీలకు అబ్బాయిల కంటే అమ్మాయిలు పుట్టే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువని అధ్యయనం  తేల్చింది. గర్భధారణ సమయంలో గర్భంలోని పిండాలు ఒత్తిడికి గురవడం వల్ల  ఆడపిల్ల అభివృద్ధికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. స్పెయిన్ పరిశోధకులు మొత్తం108 మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు.

అంతేకాదు.. గర్భిణీల జుట్టు శాంపిల్స్ తో వారిలోని కార్టిసాల్ స్థాయిని కొలిచారు. ఇది ఎక్కువగా ఉంటే అమ్మాయి..తక్కువగా నమోదవుతే అబ్బాయిపుట్టినట్లు పరిశోధనల్లో తేలింది. ది గార్డియన్‌ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం గర్భధారణ సమయంలో ఒక మహిళ అనుభవించే ఒత్తిడి గర్భం దాల్చిన 17 వారాల ముందుగానే పుట్టబోయే బిడ్డను ప్రభావితం చేస్తుందట. ఆ స్త్రీలలోని ఒత్తిడి పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధిపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. పుట్టబోయే పిల్లలు తమ తల్లి ఒత్తిడి హార్మోన్లకు గురవుతున్నారని ఈ అధ్యయనం తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: