బర్త్ డే బేబీ సింగర్ సునీత నంబర్ అడిగిన నెటిజన్.. తన స్టైల్ లో ఇచ్చింది గా..!!
సునీత తీసుకున్న డేరింగ్ స్టెప్ కి ప్రముఖుల దగ్గరినుంచి మంచి ప్రశంశలు దక్కాయి.. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీత కి మంచి పేరుంది.. ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ లకు తన గాత్రాన్ని దానం చేశారు సునీత.. ఇక సోషల్ మీడియా లో తన కొత్త లైఫ్ గురించి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. అంతేకాదు తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది.
తాజగా ఆమె లైవ్ లో ప్రేక్షకులతో ముచ్చటించగా ఓ అభిమాని డేర్ చేసి ఆమెను నెంబర్ అడిగాడు.. దీంతో సునీత నవ్వుతూనే స్వీట్‌గా తిరస్కరించేశారు. సో సారీ అండి అంటూ సునీత తప్పించుకున్నారు.అలాగే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇలా తనను ఎంతో మంది పాటలు అడుగుతున్నారని, తాను పాడుతూ ఉంటే కాస్త ఉపశమనం కలుగుతుందని భావిస్తే ప్రతి రోజూ ఇలానే ఓ అర్ధగంట లైవ్ పెడతాను అని సునీత అన్నారు.కాగా ఆమె రోజు రాత్రి ఎనిమిది గంటలకు లైవ్ లోకి వాస్తు తన అభిమానులను అలరిస్తుంది. చెప్పినట్టుగానే సునీత నిన్న రాత్రి 8 గంటలకు లైవ్‌కి వచ్చారు. తన ఫాలోవర్లు పెడుతున్న కామెంట్లను చదివారు. అడిగిన పాటలను పాడేశారు.