అమ్రాపాలిని మెప్పించిన మహిళ. ఇంత‌కీ ఎవ‌రీమె? ఏంటా క‌థ‌?

Mamatha Reddy
ఈరోజుల్లో ఎవరికి బలమైన మైండ్ సెట్ ఉండడం లేదు.. చిన్న చిన్న కారణాలకు చనిపోవడం వంటివి చేస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఆడవారిలో ఈ తరహా ఆత్మహత్యలు ఎక్కువై పోతుడడంతో ఓ మహిళ ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని జీవితాన్ని ఓ దారిలోకి తెచ్చుకుంది ఆ మహిళ ఎవరు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..
ఐఏఎస్ ఆమ్రాపాలి తన ఫేస్ బుక్ లో ఓ మహిళ కథను షేర్ చేసింది.. చిన్న చిన్న సమస్యలకే జీవితం వద్దంటూ కఠినమైన నిర్ణయాలు తీసుకునే వారికి ఈమె లైఫ్ స్ఫూర్తి అని పేర్కొంది.. ఇంతకీ ఆ మహిళ ఎవరు అంటే ఆమె పేరు యోగిత రఘు వంశీ..  ఒక మహిళ అయి ఉండి 14  చక్రాల వాహనాన్ని నడపడం ఉంటే అంత సామాన్య విషయం కాదు.. అది కూడా 30 టన్నుల లగేజీ తో కూడిన ఓ ట్రక్ ను ధైర్యంగా నడపడం అంటే  గొప్పే కదా..
వాస్తవానికి ఈమె ఒక లాయర్.. ఆమె భర్త ఒక ట్రక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తు ఉండేవాడు.. వీరికి ఇద్దరు పిల్లలు.. అంతా సంతోషంగా ఉన్న సమయంలో సడన్ గా ఈమె భర్త మరణించాడు.. దాంతో వీరి  జీవితం రోడ్డు పైకి లాగినట్లు అయింది.. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మిగిలిపోయిన ఆమె తన జీవితం ముందుకు సాగడం కోసం భర్త నడిపే ట్రక్ కు డైవర్ ను పెట్టింది.. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆ డ్రైవర్ కి వచ్చే డబ్బులు ఆదా చేయాలనుకొని తానే స్వయంగా  ట్రక్ నడపడం నేర్చుకుంది.. బహుశా దేశంలోనే ట్రక్ నడుపుతున్న మహిళ ఈమె కావచ్చు .. అలా ట్రక్ ను నడుపుతూ జీవితం  కొనసాగిస్తు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: