కడుపుతో ఉన్న మహిళా ఖైదీలను జైల్లో ఎలా చూసుకుంటారు ? పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి ?
గర్భిణీ స్త్రీ ఖైదీగా జైలు లో అడుగు పెట్టిన నాటి నుండి ఆమె సంరక్షణ మొత్తం జైలు అధికారులే తీసుకుంటారు.. ఆమెకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆమె నుండి లేదా వారి బంధువుల నుండి సేకరిస్తారు. ఆమెకి నెల నెల హెల్త్ చెకప్ జైలులో ఉండే వైద్యాధికారి దగ్గరే చేస్తూ ఉంటారు.. వారి ఆరోగ్యరీత్యా మరింత మెరుగైన వైద్య సదుపాయం, అవసరం అనుకున్నప్పుడు జైలు బయట ఉండే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు.. డాక్టర్ చెకప్ తర్వాత వారి సూచనల ప్రకారమే ఆహారము, మందులు ఇస్తారు..
మెడికల్ కేర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో డెలివరీ చేయిస్తారు.. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ జైలుకు తీసుకొని వెళ్తారు. తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ వైద్యనిపుణుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వారికి ఆహారం అందిస్తారు.. పిల్లల టీకా షెడ్యూల్ జాగ్రత్తలు తీసుకుంటారు మరియు పిల్లల కోసం, పిల్లల హెల్త్ కోసం హాస్పిటల్ విజిట్స్ ని ఏర్పాటు చేస్తారు.. పిల్లలకు సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ దానికి తల్లి చేసిన నేరం తో సంబంధం లేకుండా పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు.. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ బిడ్డకి అయిన తల్లితో కలిసి ఉండటానికి అనుమతి ఉంది.. ప్రతి జైలులో ఈ వయసు వరకు అవసరమైన పిల్లల సంరక్షణ ఏర్పాట్లు మరియు విద్యా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.. రాజీవ్ గాంధీ హత్యోదంతం లో అరెస్ట్ అయినా ఏడుగురు నేరస్తుల లో ఒకరైన నళిని అరెస్ట్ అయ్యేటప్పటికీ ప్రెగ్నెంట్.. ఆమె కూతురు జైల్లోనే పుట్టి రెండేళ్లపాటు తల్లితో నే పెరిగింది.. ప్రస్తుతం యూకే లో ఉంటుంది..