మహిళలు గర్భవతిగా అయినప్పుడు చాలా సంతోష పడుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎంతో అద్భుత క్షణాలను.. ఆనందాన్ని ఫీల్ అవుతుంది. ఆ సంతోషం బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి నియమాలు పాటించాలనే విషయాలను ఎంతో జాగ్రత్తగా తెలుసుకుంటుంది. కచ్చితమైన నియమాలు పాటించకపోవడం వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం ఉంది.
అయితే చాలా మంది గర్భిణులకు కామన్ ప్రశ్న ఒకటి మనసులో తడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ పార్టీ జరిగినా.. కూల్ డ్రింక్స్ (శీతల పానీయాలు) ప్రిఫర్ చేస్తారు. అయితే గర్భిణులు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎమైనా సమస్య తలెత్తుతుందా..? అసలు కూల్ డ్రింక్స్ తాగవచ్చా..? ఒకవేళ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయనే విషయాలను తెలుసుకుందాం.
కూల్ డ్రింక్‌లో శరీరానికి బలాన్ని చేకూర్చే న్యూట్రియంట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కెఫిన్ కూడా అత్యధికంగా ఉంటుంది. ఇవి కడుపులో ఉండే బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. అందుకే గర్భిణులు కూల్‌డ్రింక్స్ తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుందన్నారు.
అలాగే నిద్రలేమి, ఎముకలు బలహీన పడటం జరుగుతుందన్నారు. కొన్ని కంపెనీలు తమ ప్రొడక్ట్స్ సేల్ అవ్వడానికి రకరకాల రంగులు, ఫ్లేవర్లను యాడ్ చేస్తుంటాయి. ఇది కడుపులో ఉండే బిడ్డకు ఎంతో ప్రమాదకరం. దీని వల్ల పుట్టబోయే పిల్లాడు అనేక అనారోగ్య సమస్యలతో జన్మిస్తాడు. ఈ సమస్య ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్లే జరుగుతుందన్నారు.
కూల్ డ్రింక్ తయారి సంస్థలు తమ ప్రొడక్ట్స్‌లో ఎన్నో రకాల కెమికల్స్‌ను వాడుతాయి. వాటిని కంటికి కనిపించని విధంగా చిన్నగా రాసి ఉంచుతారు. వీటిలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తాయి కానీ, అనారోగ్యానికి గురి చేస్తాయి. అందుకే అతిగా కూల్ డ్రింక్స్ సేవించడం మానుకోవాలి. దీని వల్ల కడుపులోని పేగులు, గుండెల్లో మంట, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే గర్భిణులు కడుపులో పిండం తయారైన క్షణం నుంచి బిడ్డ జన్మించేవరకు ఎలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.