ఆమె కేవలం కలెక్టర్ కాదు ఒక ఊరికి దేవత

Mamatha Reddy
ఎవరి కష్టం వారు తీర్చుకోవడం కాదు ఇతరుల కష్టం తెలుసుకొని వారి కష్టాలను తీర్చడమే ఒక నాయకుడి లక్షణం. తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇతరుల కష్టాన్ని తెలుసుకొని, తీర్చి, వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసేవాడు అసలు సిసలు నాయకుడు. అలా ఓ నాయకురాలు ఒక ఊరి కష్టాలను తెలుసుకుని తీర్చి ఎంతో మంది జీవితాలను కాపాడింది. దానికి బదులుగా ఆమె పేరు నే మా ఊరి పేరు గా పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏదైనా వ్యక్తపరచడానికి భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలల వ్యవధిలో పట్టువదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం సంపాదించింది.

అక్కడ జనాలతో మాట్లాడగలిగింది. వారి సమస్యలు తెలుసుకోగలిగింది. తన కష్టం ఫలించింది. అక్కడ ప్రజలకు వారు చెప్పేది విని అర్థం చేసుకొని ఎవరో ఒక మనిషి కావాలి. ఆవిడ ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగింది. ప్రత్యేక గిరిజన కోఆర్డినేటర్లను ప్రభుత్వ ఆస్పత్రిలో భాష అనువాదకులను నియమించి దగ్గరి నుండి పరిపాలన కార్యాలయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, భాషను స్వయంగా నేర్చుకోవడం వరకు దివ్య దేవరాజన్ మా ఊరి ప్రజలకు చేరువై వారి కష్టాన్ని తెలుసుకోవడం వరకు వెళ్లడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు.

దాంతో దివ్య ఆఫీసర్ మేడం అనే హోదా నుండి వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు. ఇటీవలే ఆదిలాబాద్ వాసులు దివ్య చేసిన పనులకి కృతజ్ఞతతో తమ జిల్లాలోని ఒక ఊరికి దివ్య గూడా అని పేరు పెట్టారు. దివ్య తో పని చేసిన బృందం సమస్యలన్నిటిని చాలా తొందరగా పరిష్కరించగలుగుతుందని ఆ ప్రాంతంలో నిరక్షరాస్యత, నిరుద్యోగం, పారిశుద్ధ్య నీటిపారుదల అనారోగ్య సమస్యలు మరియు వరదలు ఇలాంటి ఎన్నో సమస్యలను అధిగమించడానికి ఎంతో కృషి చేసింది అని చెప్పారు. కంప్యూటర్ నుండి ఇంటర్నెట్ కనెక్టివిటీ మూసివేయడం వరకు ఇలాంటి ఇబ్బందులు ఎన్నిటినో ఆదిలాబాద్ ఈ ప్రాంతం చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో దివ్య ఆ ఊరి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించి వారి నమ్మకాన్ని పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

IAS

సంబంధిత వార్తలు: