2 మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి

Mamatha Reddy
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా పాపులర్ అవుతున్నారో ఎవరికీ తెలియడం లేదు. తమకు తెలిసిన టాలెంట్ ని వీడియో గా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చాలు కోట్ల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్, వేల కొలది కామెంట్లు పెడుతూ వారిని ఉత్సాహ పరుస్తున్నారు నెటిజన్లు. అలా వారు సెలబ్రిటీలు గా మారి తమ జీవితాన్ని సెట్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది అదృష్టంకొద్దీ పాపులర్ అయిన వారు అయితే మరికొంతమంది రియల్ టాలెంట్ తో పాపులర్ అయిన వారు ఉన్నారు.

సోషల్ మీడియా వల్ల ఎంత కీడు ఉంటుందో అంతే మేలు కూడా ఉంటుంది. తక్షణ సాయం లభించాలి అన్నా, రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలన్నా, సోషల్ మీడియా తోనే సాధ్యం. కన్నుగీటు తో ప్రియా వారియర్, అద్భుతమైన గ్రాం తో రేణు ముండాల్, నీలికళ్లు, అందమైన రూపంతో హర్షద్ ఖాన్ లాంటి వారందరినీ సోషల్ మీడియా రాత్రికి రాత్రే సెలబ్రిటీలు గా మార్చింది. వీరే కాకుండా మనకు తెలియని ఇతరులకు బాగా పరిచయమైన సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. తమకే సొంతమైన టాలెంట్ ని సోషల్ మీడియాలో చూపించి భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు.

తాజాగా మరొక యువతి తన అందమైన రూపంతో ఇంటర్నెట్ ను  షేక్ చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకు రెండు మిలియన్ల మంది వీక్షించారు. జాస్మిన్ సైనీ అనే  ఇంస్టాగ్రామ్ లోని ఈ వీడియోలో ఓ యువతి కట్టెలపొయ్యి ముందు కూర్చుని చేతలతో చాలా అలవోకగా రొట్టెలు చేస్తోంది. యువతి వెనక కుక్కలు, పిల్లలు ఆడుకోవడం చూస్తే ఏదో పల్లెటూరులా అనిపిస్తోంది. ఇక ఈ వీడియో ని చూస్తున్నంత సేపు యువతి మొఖం మీద నుంచి చూపు తిప్పుకోలేరు. ఈమె సోషల్ మీడియాలో మరో సెలబ్రెటీ అవుతుందని ఈమెను చూసిన వారంతా కామెంట్లు పెడుతున్నారు. ఈమె ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటూ కామెంట్ చేస్తున్నారు. మన దర్శకనిర్మాతలు ఈమెను సంప్రదిస్తారా  లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: