అమ్మ: గర్భిణులు వ్యాయామం చేయవచ్చా..!
అంతేకాదు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. వైద్యుని సలహా మేరకు కొన్ని చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. ఇక కొన్నిసార్లు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది తినాలన్న మంచిదో కాదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో వ్యాయామం చేయడం మంచిది. చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల వెన్ను నొప్పి, కండరాల నొప్పి తగ్గి మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అంతేకాదు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కానీ ప్రెగ్నెన్సీ మహిళలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మాత్రం అస్సలు చెయ్యకూడదు.
అయితే గర్భాశయ సమస్యలు ఉంటే మహిళలు కఠినమైన వ్యాయామాలు చేస్తే అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి వారు వ్యాయామాలు అస్సలు చేయకూడదు. మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు గర్భస్రావం జారిన వారు తొమ్మిది నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం వచ్చిన మహిళలు పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే వ్యాయామాలు చేయాలి. ఏ సమస్య ఉన్నా కూడా వ్యాయామం చేదాం మంచిది కాదు. ఒక వేళ వ్యాయామాలు చేసే వారు తప్పకుండ వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.