ఏ యువతీ చేయలేని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కథ.. కన్నీటి వ్యధ

Mamatha Reddy
సమాజంలో ఏదో ఒక మూలన ఆడవారు అంటే చిన్న చూపే ఉంటుంది చాలా మందికి. వారు బయట పని చేయడానికి పనికి రారని, ఇంట్లో వంటింటి కుందేలు లాగానే జీవించాలని, మగవారు చేసే ఏ పనిలోనూ సరితూగరని, మగవారికి అసలు సమానం కాదు అని తేల్చి చెబుతూ ఉంటారు కొందరు. కానీ వారి ఆలోచనలకు సమాధానమిస్తూ తాము ఎందులో అయినా సత్తా చాటి తమని తాము నిరూపించుకోగలమని ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు నిరూపించారు. కష్టాల ఊబిలో కూరుకుపోయి కూడా గెలుపు తీరాన్ని తాకిన ఎందరో మహిళలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే శిరీష కథ ఒకటి.

లైన్ మెన్ జాబ్ అంటే కరెంటు స్తంభాలు ఎక్కి, వైర్లను బిగించి మృత్యువుతో పోరాటం చేయడం లాంటిది. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా రాత్రనకా, పగలనకా వెంటనే వెళ్లి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి.  ఇలాంటి పనులను మహిళలు చేయడానికి అర్హులు కారు, వారు చేయలేరు, అని ఎంతోమంది తేల్చేశారు. ఈ జాబ్ లో ఉండే కష్టాలు ఎన్ని అయినా వాటిని తాను చేయగలనని నిరూపించి ఆడుతూ పాడుతూ సాధించి చూపించింది శిరీష అనే అమ్మాయి. స్తంభాలు ఎక్కడం, గోడలు ఎక్కడం వంటివి అబ్బాయిలు ఆడుతూపాడుతూ చేస్తుంటారు కానీ ఈ అమ్మాయి అబ్బాయిలతో సమానంగా స్తంభాలు గోడలు ఎక్కి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

తెలంగాణ గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన శిరీష ఫస్ట్ లైన్ విమెన్ జాబ్ కొట్టింది. అసలు లైన్ విమెన్ జాబు ఉంది అని కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఈ జాబ్ కి అప్లై చేసే అమ్మాయిలు కూడా ఉండరు కానీ శిరీష ధైర్యంగా అప్లై చేసి పరీక్షలో, ప్రాక్టికల్ టెస్ట్ లో కూడా విజయం సాధించింది. ఇలాంటి జాబ్ లు అమ్మాయిలు చేయగలరా అన్న వాళ్ళ నోళ్ళు మూయించింది. తన మామయ్య శేఖర్ ఇచ్చిన గైడెన్స్ తోనే తాను ఈ ఉద్యోగం సాధించగలిగాను అని ఆమె చెప్పగా ఇంటర్వ్యూ టైంలో మగవాళ్లు చేసే ఈ జాబ్ మీకు సూట్ అవ్వదు అని చెప్పడంతో నిరాశపడ్డారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేసి మరీ తను ఆ జాబు చేయాలనుకుంటున్నట్లు తెలిపి చివరికి ఈ కేసులో నెగ్గింది శిరీష.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: