అమ్మ: గర్భిణులు పారసిటమాల్ వాడుతున్నారా..?
ఇక వైద్యులు కూడా గర్బిణీలకు ఆహారం, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెపుతుంటారు. సాధారణంగా ప్రెగ్నెసీ సమయంలో గర్భిణులు అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే గర్బిణులు తీసుకునే మెడిసిన్‌పై పలు అధ్యాయానాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక తాజాగా గర్భిణీలు పారసిటమాల్ మాత్రలను వాడితే వారికి జన్మించే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందా అనే అంశంపై జరిగిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పరిశోధకులు చెప్పారు.
అయితే ఈ అధ్యయనం గురించి యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించారు. ఇక ఈ అధ్యాయాన్నికి స్పెయిన్‌లో బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ నాయకత్వం వహించారు. అయితే ఇంతక ముందు ఈ పరోశోధనకు లా కైక్సా ఫౌండేషన్ సపోర్ట్ చేసింది. ఇక ఈ అధ్యయనంలో ఐరోపా దేశాలకు చెందిన 70వేల మందికిపైగా పిల్లల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషణ చేశారు.
సాధారణంగా కొంతమంది గర్భిణులు పారసిటమాల్‌ను వాడుతుంటారు. ఈ మాత్రను వాడటం వలన పుట్టిన పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆటిజం స్పెక్ట్రమ్ కండిషన్స్ అనే సమస్యను గుర్తించినట్టు తెలియజేశారు. అయితే గర్భిణీలు పారసిటమాల్ వాడకంపై గతంలో వెలువడిన పరిశోధన ఫలితాలతో మేము ఏకీభవిస్తున్నామని ఈ అధ్యయనం నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక గర్భిణీలు కేవలం అత్యవసరమైనప్పుడు మాత్రమే పారసిటమాల్‌ను వాడాలని పరిశోధకులు తెలియజేశారు.