అమ్మ: పాలిచ్చే తల్లులు బరువు తగ్గాలంటే ఇలా చేయండి..?

N.ANJI
గర్భిణులు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొంతమంది మహిళలు బరువు పెరుగుతుంటారు. ఇక ప్రసవం తరవాత బరువు పెరిగిన మహిళలు బరువు తగ్గాలంటే ఈ నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ నియమాలేంటో ఒక్కసారి చూద్దామా.
ఇక ఒకవేళ మీరు బిడ్డకు తల్లి పాలు పడుతున్నట్టయితే వేగంగా బరువు తగ్గేందుకు రకరకాల డైట్‌లు చేయడం వల్ల పాలు సరిగా పడకపోయే అవకాశం ఉందని అన్నారు. అలాగే పాలు ఇస్తున్నప్పుడు తల్లిగా మీరు కూడా తగిన మోతాదుల్లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బిడ్డకు పాలు ఇచ్చే మొదటి ఆరు నెలలు మీ ఆహారంలో కనీసం అరవై నుండి డెబ్బై గ్రాముల మాంసకృత్తులు ఉండాలని అన్నారు. అయితే దీనికోసం మీరు పాలు, పెరుగు, గుడ్లు, పప్పు ధాన్యాలు, పుట్టగొడుగులు, మాంసాహారం తినేవారైతే వారంలో రెండు సార్లు వంద గ్రాముల చికెన్‌ లేదా చేపలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు.
అంతేకాదు.. పోషకాలున్న ఆహారంతో పాటు రోజుకు కనీసం రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలని చెబుతున్నారు. ఇక మీరు బరువు తగ్గడానికి ఆహారాన్ని మరీ తక్కువగా తీసుకుంటే, బిడ్డకు పాలు తక్కువయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అయితే తక్కువగా కాకుండా రోజులో మీకు అవసరమయ్యే కెలోరీల కంటే రెండు, మూడు వందల గ్రాములు తక్కువగా తీసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గుతారని అన్నారు. ఆలా చేయడం వలన బిడ్డకు పాలకు కూడా ఇబ్బంది ఉండదని అన్నారు.
అయితే బిడ్డకు ఘనాహారం మొదలు పెట్టిన తరువాత మీరు మరికొన్ని కెలోరీలు తగ్గించుకోవచ్చునని అన్నారు. ఇక ఇలా తగ్గించి తీసుకోవడం వల్ల అలసట రాకుండా ఉండాలంటే ఆహారం సమయానికి తీసుకోవడం అవసరం అని అన్నారు. అలాగే పళ్ళు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు లాంటివి కావలసిన ఖనిజ లవణాలను అందిస్తాయని అన్నారు. ఇక ఆహార జాగ్రత్తలతో పాటు రోజుకు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాలు ఏదైనా వ్యాయామం చేసి బరువు తగ్గవచ్చునని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: