అమ్మ: తల్లులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి..!

N.ANJI
గర్భిణులు గర్భధారణ సమయంలో ఎన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటారో ప్రసవం తరువాత అనే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రసవం తరువాత తల్లులు కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటూ ఉండాలని అన్నారు. తల్లులు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. అలాగే ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, మినరల్స్ లాంటివి తప్పకుండా తీసుకోవాలి. కొన్ని పదార్థాలు తప్పకుండా ప్రతి ఒక్క తల్లి కూడా డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. అవి ఏమిటో ఒక్కసారి చూద్దామా.
తల్లులు తీసుకునే డైట్‌లో తప్పకుండా కాల్షియం ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరోగ్యకరమైన ఎముకలు పొందడానికి కాల్షియం చాలా అవసరం. అంతేకాక కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం తప్పకుండా తీసుకోవాలని అన్నారు. అయితే విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రావు. డైరీ ప్రొడక్ట్స్, బచ్చలి కూర, సోయా బీన్స్, కమలారసం, ఓట్ మీల్ వంటివి తప్పకుండా తీసుకోవాలని అన్నారు. అలాగే కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుని ఎన్నో లాభాలు పొందొచ్చునని అన్నారు.
అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో తీసుకుంటూ ఉండాలని అన్నారు. ఇక బోన్ డెన్సిటీ, మజిల్స్‌కి ప్రోటీన్స్ చాలా అవసరం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లులు బీన్స్, గుడ్లు, పల్లీలు వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. అలాగే వాటితో పాటుగా నట్స్ వంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక డైట్‌లో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవడం మంచిది. అంతేకాక అనేక రకాల సమస్యలను దూరం చేస్తాయని అన్నారు. ఇక వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయని తెలిపారు. ఇక సీజన్‌లో వచ్చే పండ్లు కూరగాయలు కూడా తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: