వ్యవసాయం చేసుకుంటూ నే చదువుకున్న చదువుల తల్లి రమ్య..!!

Mamatha Reddy
దేశంలో ఇంకా ఎంతో మంది చదువు కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. చదువు కోసం భవిష్యత్తులో ఎదగడం కోసం వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. పొట్టకూటికి లేకున్నా పొట్ట చేత పట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ తాము ఎదగాలని కోరిక ను బలంగా చెబుతూ కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుండటం ఎందరికో స్ఫూర్తి కలిగిస్తుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీ రమ్య అనే విద్యార్థి చదువు కోసం ఎన్నో కష్టాలు పడుతుంది.

పేదింటి బిడ్డ అయిన రమ్య చదువులో మేటి. ఎన్నో పతకాలను గెలుచుకుంది. అయితే కరోనా మహమ్మారి అందరి జీవితాలను కకావికలం చేసినట్లే రమ్య జీవితాన్ని కూడా తలకిందులు చేసింది. తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా కరోనా బారిన పడిపోవడంతో రమ్య జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది కరోనా. అన్నీ తానై తన కుటుంబానికి అండగా నిలిచింది. అమ్మ నాన్నల కోసం ఇష్టమైన చదువు కూడా పక్కనపెట్టి నాగలి పట్టింది. కష్టాలను ఓర్చుకని తల్లిదండ్రులకు అండగా వ్యవసాయం చేయడంలో తోడుగా నిలిచింది. 

సేద్యం చేస్తూ కరోనా తర్వాత కుటుంబం ముక్కలు కాకుండా ఆపదలో పడకుండా ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ తన బాధ్యతను నిర్వహిస్తుంది. చదువుకుంటూనే వ్యవసాయం చేస్తూ గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్న రమ్య హైదరాబాదులో ఏవీ కాలేజీలో చదువుతోంది. స్కూల్లో చదివేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేది. అయితే కరోనా కారణంగా ఇంటి దగ్గరే ఉన్న ఆమెకు మరో కష్టం వచ్చింది. కుటుంబ సభ్యులకు కరోనా రావడంతో అన్ని పనులు తనే చేయవలసి వచ్చింది. చదువులోనే కాకుండా క్రీడల్లో రమ్య మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీ కి అవార్డులు సాధించగా కొన్ని కారణాల వల్ల జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న లేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: