నెలసరి సమయంలో వ్యాయామం చేస్తున్నారా ?

frame నెలసరి సమయంలో వ్యాయామం చేస్తున్నారా ?

VAMSI
రుతు చక్రం అనేది మహిళలకు తరచూ వచ్చేదే. అయితే రుతుక్రమం విషయంలో చాలా మంది ఆడవారికి పెద్దగా అవగాహన ఉండదు. అయితే ఆ విషయం గురించి ఇతరులను అడగలేక ఆ సందేహాలను ఎవరిని అడగరు. అలాగే చర్చించడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి సందేహాలతో తరచూ వ్యాయామం చేసే వారు, చేయాలి అనుకునే మహిళలు రుతుక్రమం సమయంలో కూడా వ్యాయామం చేయవచ్చా అని సందేహం ఉంటుంది. కొందరు పిల్లలున్న మహిళలు వ్యాయామం చేయొచ్చుకాని, పెళ్ళికాని వారు, పెళ్ళై ఇంకా పిల్లలు లేని వారు మాత్రం అస్సలు నెలసరి సమయంలో వ్యాయామం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన కొన్ని రకాల హార్మోన్లు విడుదలై వారికి భవిష్యత్తులో అండాలు విడుదల కావని..తద్వారా చాలా మంది పిల్లలు కలిగే అవకాశాలను కోల్పోతారని భయపడుతున్నారు.
ఇలా చాలా రకాలుగా అంటుంటారు కొందరికి స్వయంగా ...ఈ సమయంలో వ్యాయామం చేయడం కరెక్టేనా అన్న అనుమానాలు వస్తుంటాయి. అయితే ఇందుకు నిపుణులు చెబుతున్న మాట ఏమిటంటే. నెలసరి సమయంలో సాధారణంగా మహిళలు అందరికీ రక్త స్రావం అనేది సర్వసాధారణం. అయితే కొందరిలో ఎక్కువగాను మరికొందరికి  తక్కువగాను రక్తస్రావం అవుతుంది. ఇలా ఒక్కొక్కరిలోనూ ఒక్కో విధంగా రక్తస్రావం అనేది అవుతుంది. అలాగే ఆ సమయంలో కొందరికి రకరకాల నొప్పులు వస్తుంటాయి. కొందరికి నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, భరించలేనంత కాళ్ళు నొప్పులు, కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. ఇంకొందరికి కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టు భరించలేనంత నొప్పి వస్తుంది. ఇవన్నీ అందరికీ రావాలని లేదు....కొందరిలో కొన్ని కొన్ని నొప్పులు ఉంటాయి మరికొందరిలో ఉండవు.
అయితే నొప్పులు అధికంగా ఉన్నప్పుడు వ్యాయామం వంటివి చేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలా కాకుండా ఏ నెప్పులు లేకపోయినా లేదా నొప్పులు తక్కువగా ఉంటే మాత్రం ఆ సమయంలో వ్యాయామం మంచిదే తద్వారా ఆ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఇక నెలసరి సమయంలో వ్యాయామం చేయడం వలన భవిష్యత్తులో గర్భధారణ విషయంలో సమస్యలు వస్తాయా అంటే ఖచ్చితంగా కాదనే అంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఆ సమయంలో వ్యాయామం చేయడం వలన దాని కారణంగా ఎలాంటి సమస్యలు రావని కేవలం మీ శరీర పరిస్థితిని బట్టి నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే..మీరు మరింత నీరసించడం, అలసిపోవడం కాస్త ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఆ సమయంలో మాత్రమే వ్యాయామం చేయకపోవడమే మంచిది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: