మహిళ స్వేచ్చగా బ్రతికే రోజులు వస్తాయా?

VAMSI
ఈ ప్రపంచానికే మూలం స్త్రీ, స్త్రీ జీవితం ఎంతో ఆదర్శం. తల్లిగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా, స్నేహితురాలిగా ఇలా తన ప్రతి బంధాన్ని ఎంతో పవిత్రంగా చూస్తూ తన కుటుంబ సభ్యుల కోసం ప్రాణం పెట్టేదే స్త్రీ అంటే, శాంతి స్వరూపంగా వర్ధిల్లే స్త్రీకి ఆగ్రహం వచ్చిందంటే అది ఎన్నో ప్రళయాలకు కారణం అవుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అమూల్యమైన ధనం స్త్రీ. కానీ ఇప్పటికీ స్త్రీ అంటే సమాజంలో ఎంతో కొంత చులకన భావం ఉంది. నేటికి ఆడపిల్ల అని తెలిస్తే పురిటిలోనే చంపబడుతున్నారు. కొందరు రోడ్లపై వదిలి తమ దారి తాము చూసుకుంటున్నారు. మహిళలు అంటే భారం కాదని మన ముందున్న అద్భుతమైన వరం అని అన్ని రంగాలలోనూ మహిళలు తమ సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. 

కుటుంబ బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకుని సమర్థవంతంగా ఆ బాధ్యతను నిర్వహిస్తున్న ఈ రోజుల్లో కూడా కొందరు మూర్ఖులు మాత్రం తనని మన కంటి ముందుకు రానివ్వకుండానే గర్భంలో ఉన్నది స్త్రీ అని  తెలిస్తే ఆ గర్భంలోనే స్త్రీని నాశనం చేసేస్తున్నారు. భర్త, అత్తింటి వారి పోరు పడలేక తన గర్భంలో ఉన్న మరో స్త్రీ రూపాన్ని వదులుకోలేక ఆ మహిళ పడే వేదన ఈ ప్రపంచంలో ఎవరికి అర్దం అవుతుంది మరో స్త్రీకి తప్ప.  తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన పురాణాలు సైతం స్త్రీ మాతృ మూర్తికి విలువ ఇచ్చి పెద్ద పీట వేసి అగ్ర స్థానం ఇస్తే అలాంటి స్త్రీ పై కొందరు దుర్మార్గులు, పాపాత్ములు, దుర్మార్గులు  అత్యాచారాలు చేయడం, స్త్రీలను హింసించడం ఘోరం, మహాపాపం.  

మన భరత మాత భవిష్యత్తు కూడా స్త్రీ పై ఆధారపడి ఉందన్నది అక్షర సత్యం. ఇది కొందరు మూర్ఖులు అర్దం చేసుకోలేక పోతున్నారు. తనకు జన్మనిచ్చి ఈ లోకంలోకి తీసుకొచ్చిన స్త్రీ జాతికి అన్యాయం చేస్తూ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇవి అంతమయ్యే రోజు రావాలి. స్త్రీకి పరిపూర్ణమైన స్వేచ్చ రావాలి. ఆ మార్పు ముందు మన నుండే రావాలి. మనం మారితే మన సమాజంలో మార్పు వస్తుందన్న విషయాన్ని గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: