సైబర్‌ల్యాబ్‌ తో మహిళలకు, చిన్నారులకు అభయం !!

Surya

సోషల్ మీడియా పుణ్యమా అని యుక్తవయసు పిల్లలు , మహిళలు మోసాలకు , వేధింపులకు గురవుతున్నారు. ప్రతినిత్యం ప్రపంచంలోని ఏదో ములలో స్త్రీ వేదించబడుతూనే వుంది. భారత్ లో ఈ ఆన్లైన్ మోసాలు మరీ ఎక్కువ గా నమోదు అవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం రక్షణ శాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దానిపేరు సైబర్ ల్యాబ్ . ఈ సైబర్ ల్యాబ్ ద్వారా మహిళలకు, చిన్నారులకు ఎదురౌతున్న వేధింపులకు సంబందించిన కేసులను పరిష్కరిస్తారు. ఈ సైబర్ ల్యాబ్ తెలంగాణ మహిళా భద్రత విభాగం పర్యవేక్షణలో ఉంటుంది. ఇందులో నమోదైన ఫిర్యాదులను శీఘ్రగతిన పరిష్కరిస్తారు. అయితే ఈ ప్రోగ్రాం ను నవంబర్ రెండు న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


తెలియని వ్యక్తుల ద్వారా , మొబైల్ మొదలగు వాటి ద్వారా రోజురోజుకి పెరుగుతున్న వేధింపుల నేపథ్యంలో ఈ ల్యాబ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతం లో ఇలాంటి ఆన్లైన్ మోసాలు త్వరగా పరిష్కారం అయ్యేవి కాదు. గతం లో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేకపోవడంతో కేసులు అంత తొందరగా పరిష్కరించబడేవి కాదు. రానున్న ఈ కొత్త టెక్నాలజీ తో ఈ సమస్యలను త్వరగా పరిష్కరించనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా రాష్ట్రం లో ఉన్న దాదాపు 700 పైగా ఉన్న మహిళా పోలీస్టేషన్ లలో , శాంతి భద్రతల విభాగాల్లో నమోదు అయ్యే వేధింపులకు సంబందించిన సాంకేతిక పరిజ్ఞాన్ని సైబర్‌ల్యాబ్‌ ద్వారా అందించనుంది . సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌ తో మహిళా భద్రత విభాగం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది .

ఇందుకోసం సీఆర్‌సీఐడీఎఫ్‌ వినూత్న టూల్స్ ని వినియోగించనుంది. ఇందుకోసం ఫోరెన్సిక్ నిపుణులు నిరంతరం అందుబాటులోకి రానున్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో చిన్నారులకు , మహిళలకు ఎదురయ్యే బెదిరింపులు , అక్రమ రవాణాలు వంటి వ్యవస్తీకృత నేరాలపై  ఈ ల్యాబ్ నిఘా పెట్టనుంది. తెలంగాణ లోని అన్ని షీ టీం లకు యాంటీ హ్యూమన్‌ ట్రాఫిక్‌ యూనిట్లకు ఈ ల్యాబ్ ద్వారా నిరంతరం సాంకేతిక సహకారం అందించనున్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ నిర్వహించి , కేసుల ఛేదన , నేరాల నియంత్రణ వంటి విషయాలపై అవగాహనను దీనిద్వారా అందించనున్నారు. అదేవిధంగా చిన్నారులకు , మహిళలకు భద్రత కల్పించే విధంగా ఈ సైబర్ ల్యాబ్ ఉపయోగపడుతుందని డీజీపీ స్వాతిలక్రా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: