బాల భారతం : తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తు వీరి చేతుల్లో పెట్టారు

Vennelakanti Sreedhar

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ  
పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !
కుమారుడు పుట్టానే తండ్రికి  సంతోషం కలుగదు. వాడు ప్రయోజకుడై,  ప్రజలందరూ అతడి పై  ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పుడు ఆ  తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని సుమతి శతకం లోని పద్యం మనకు వివరిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం పుత్రుడు అన్నా,పుత్రిక అన్నా సంతానంగానే చూడాలి.
తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ఏ తల్లితండ్రులకు ఉండదు ? వారి చిన్నారుల బోసి నవ్వులు ఎవరికి ఇష్టం ఉండదు?  తమ పిల్లల నవ్వులు చూసి ఆనంద పడని తల్లితండ్రులు ఎక్కడైనా ఉంటారా ? ఖచ్చితంగా ఉండరు. నెలల వయసులోనే  చిన్నారులకు 'ఆటిజం' వ్యాధి సోకితే ?  ఆ వ్యాధికి ఎక్కడ చికిత్స లభిస్తుంది ? ఇది గతంలో  వేలాది తల్లి తండ్రులను వేదించిన సమస్య. ప్రస్తుతం ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రత్యేక  అవసరాలున్న పిల్లలకు ప్రత్యేకంగా  పినాకిల్ బ్లూమ్స్ లో శిక్షణ  పొందుతున్నారు.  జంట నగరాలలనే 14 కు పైగా పినాకిల్ బ్లూమ్స్ శాఖ  లున్నాయి.జంటనగరాలే కాదు, విజయవాడ, విశాఖ పట్నం, ఢిల్లీ తో బాటు  వివిధ దేశాలలోనూ పినాకిల్ బ్లూమ్స్ శాఖలున్నాయి.
 నెలల వయసులోనే పిల్లలు బావ  వ్యక్తీకరణ చేస్తారు. ఆ తరువాతే వారికి భాష వస్తుంది. కొందరికి కొన్ని నెలల వయసులోనే  భాష వస్తే, మరి కొందరికి  ఇంకోంచెం ఆలస్యంగా  మాట్లాడటం వస్తుంది.  పిల్లల్లో ఎదుగుదల సరిగా లేక పోవడం లోపం అంటారు వైద్యు రంగ నిపుణులు. మానవసికంగా ఎదగలేని పిల్లలు  అందరి లాగా నవ్వులు చిందించ లేరు. అలాంటి పిల్లలను తల్లి తండ్రులు గుర్తించాలి.  పిల్లల్లో మానసిక ఎదుగుదల లేక పోవడాన్ని 'ఆటిజం'  అని వైద్య పరిభాష లో వ్యవహరిస్తారు. పిల్లల ఎదుగుదలలో  లోపాలను తల్లితండ్రులు గుర్తించాలి. వారిని సరైన మార్గంలో పెట్టాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు కూడా.  ఎలాంటి అనుమానం వచ్చినా  టోల్ ఫ్రీ నంబర్  9100 181 181 కు  ఫోన్ చేయాలి.
గతంలో తెలుగు రాష్ట్రాలలో 'ఆటిజం చిన్నారుల ఆలనా పాలనా చూసే దిక్కు లేదు.  ఆసలు 'ఆటిజం 'అంటే ఏమిటో, దాని లక్షణాలు ఏమిటో ఏదో కొద్ది మందికి మినహా ఎక్కువ మందికి తెలీదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారత్ లో  లక్షలాది మంది పిల్లలు  ఆటిజం నుంచి రక్షణ పొందుతున్నారు. హైదరాబాద్ కు చెందిన  కోటి రెడ్డి సరిపల్లి, శ్రీజ రెడ్డి సరిపల్లి దంపతులు  'ఆటిజం ' లక్షణాలు ఉన్న చిన్నారులకు తమ వంతు సేవచేస్తున్నారు.  వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకో సం వారు ఏకంగా ఓ సంస్థనే ఏర్పాట చేశారు. ఆ సంస్థ పేరు పినాకిల్ బ్లూమ్స్. జంట నగరాలలో ఎన్నో బ్రాంచ్ లు ఉన్న  ఈ సంస్థ దేశ విదేశాలలో తమ సేవలు అందిస్తోంది. లక్షలాది మంది తల్లితండ్రులను శోకం నుంచి దూరం చేస్తోంది. వారి ముఖాల్లో  సంతోషపు ఛాయలు చిగురింపచేస్తున్నారు కోటిరెడ్డి, శ్రీజ రెడ్డి దంపతులు.  ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది మనుషులుంటారు. వారిలో ఎంతో మంది దంపతులుంటారు. సేవా భావం కలిగిన పుణ్య దంపతులు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారే reddy SARIPALLI' target='_blank' title='కోటి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి రెడ్డి సరిపల్లి, శ్రీజ రెడ్డి సరిపల్లి దంపతులనడం చిన్నారుల దినోత్సవం సందర్భంగా  సబబుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: