అమ్మ : గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?
ఆహారంలో తప్పకుండా కాల్షియం, ప్రోటిన్స్, ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలుండేవిధంగా చూడాలి. ఆడవారు మామూలుగా తీసుకునే దానికంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతీరోజు 300 నుంచి 400 క్యాలోరీలను ఎక్కువా తీసుకోవాలని ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన వైద్యులందరూ పేర్కొంటన్నారు. ప్రసవానికి ముందు తప్పకుండా తీసుకోవాలి.
అదేవిధంగా గర్బంతో ఉన్న వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన మూలకం మినరల్స్. గర్భసమయంలో వారి శరీరం లోపల, బయట వచ్చే మార్పులకు తట్టుకొని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలంటే.. మినరల్స్ తప్పనిసరి ఎంతో అవసరం. ఆక్సిజన్ పోషకాలను శరీర అన్నీ భాగాలకు అందేవిధంఆ చేసే ఎర్ర రక్తకణాల ఎక్కువ ఉత్పత్తి అయ్యేవిధంగా మినరల్స్ ప్రముఖ పాత్ర పోసిస్తాయి.
గర్భిణీలు తీసుకునే ఆహారంలో అవసరం మేరకు మాత్రమే కార్బొహైడ్రేట్స్, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేవిధంగా చూసుకోవాలి. గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతున్నది. త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో విసర్జక పదార్థాలు బయటికీ పంపించడంలో విఫలమవ్వడం వల్ల రక్తం చెడిపోయి ఇతర ఇన్‌ఫెక్షన్ కలిగే అవకాశం లేకపోలేదు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి.
ముఖ్యంగా గర్భవతులు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే బెటర్. రోజు తీసుకునే ఆహారంలో పండ్లు తప్పకుండా ఉండేవిధంగా చూసుకోవాలి. కొందరూ అరటిపండ్లను తినవద్దు అని సూచిస్తుంటారు. ఫొలిక్ ఆసిడ్ ఎక్కువా ఉంటే అరటిపండ్లను తినండి. అయితే కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాలు తినాలి. మీరు చెక్ చేయించుకునే డాక్టర్ సలహాలు, సూచనలు పాటించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజు గ్లాస్ అన్నీపండ్లు కలిపిన పండ్ల రసాన్ని తీసుకోవడం ద్వారా సులభ ప్రసవం అయ్యే ఛాన్స్ ఉంటుంది.