అమ్మ: గర్భిణీలు కొబ్బరి నూనె వాడకం ఎంత మంచిదో తెలుసా..??
అయితే గర్భిణులకు కూడా కొబ్బరి నూనె అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో వివిధ రకాల సమస్యలను కొబ్బరి నూనెతో నివారించుకోవచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. ఆలస్యం గర్భిణీలకు ఏయే విధంగా కొబ్బరి నూనె ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
ఇక ఆపరేషన్ అంటే భయపడే గర్భిణీ స్త్రీలు.. నార్మల్ డెలివరీ కావాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. నార్మల్ డెలివరీ కోసం ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తారు. గర్భిణులకు నార్మల్ డెలివరీకి కొబ్బరి నూనె ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అయ్యితే కొబ్బరి నూనెతో వండిన ఆహారాలు తీసుకుంటే సహజ కార్పు జరుగుతుందని అన్నారు. అలాగే రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించి తీసుకుంటే గర్భిణీల శరీర బరువు అదుపులో ఉంటుందని తెలిపారు. ఇక కడుపులోని శిశువు ఎదుగుదల కూడా బాగుంటుందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. గర్భధారణ సమయంలో కొందరు మహిళలు రుచిని కోల్పోయి ఇబ్బంది పడుతుంటారు. అలంటి వారు కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలించాలని చెప్పారు. అంతేకాదు.. టేస్ట్ బడ్స్ యాక్టివ్‌గా మారతాయని అన్నారు. ప్రెగ్నెసీ తీవ్రంగా వేధించే సమస్య స్ట్రెచ్ మార్క్స్.. అవి గర్భధారణ తర్వాత కొబ్బరి నూనెతో రోజూ చర్మానికి పట్టించి మసాజ్ చేసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ చాలా అంటే చాలా సులభంగా వదిలించుకోవచ్చున్నారు. అలాగే గోరు వెచ్చటి కొబ్బరి నూనెను చేతులోకి తీసుకుని కడుపుపై అప్లై చేసుకుని స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలని అన్నారు. ఆలా చేస్తే కడుపు మళ్లీ మామూలుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.