అవార్డ్ ను గెలుచుకున్న కనుమూరి జ్యోతి !
ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు అనేక ఆహార ఆరోగ్య సలహాలు ఇన్ స్టా గ్రామ్ లో తరుచు ఆమె సలహాలు ఇస్తూ ఉంటుంది. బ్యూటీ కంటెస్ట్ ల పోటీల పై తనకు ఉన్న అభిరుచితో ఆమె మిసెస్ గ్రాండ్ ఇంటర్ నేషనల్ ఈవెంట్ లో ఈమె మొదటిసారి పాల్గొనడమే కాకుండా అవార్డులు గెలవడం ఆమె చైతన్యానికి నిదర్శనం. శ్రీమతి జ్యోతి భర్త మనోజ్ మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తూ తనకు వ్యాపార రంగం పై ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న నైపుణ్యంతో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ZEN 3 అతి తక్కువ కాలంలో సాధించిన విజయాలు టెక్ మహేంద్ర సంస్థ గుర్తించడంతో ZEN 3 ని టెక్ మహేంద్ర సంస్థలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షియాటిల్ నగరంలో రియల్ ఎస్టేట్ లాజిస్టిక్స్ కంపెనీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న మనోజ్ జ్యోతి విజయాలలో పరోక్ష సహకారి.
సుప్రసిద్ధ నవలా రచయిత్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి కోడూరి పద్మిని ఇరిగేషన్ శాఖలో ఉన్నత ఉద్యోగం నిర్వహించిన కనుమూరి పట్టాభి రామారావు గారి కోడలు శ్రీమతి జ్యోతి.